V6 News

పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలె.. తెలంగాణ రైతు సంఘం డిమాండ్

పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలె.. తెలంగాణ రైతు సంఘం డిమాండ్

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంలోని నాలుగు లక్షల ఎకరాల పోడు భూములకు రైతు బంధు ఇవ్వాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోతినేని సుదర్శన్, తీగల సాగర్​ అన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిర్వహించిన సంఘం రాష్ట్ర మహాసభలు శనివారం ముగిశాయి.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహాసభల్లో 30 అంశాలపై తీర్మాణాలు చేశామన్నారు. రానున్న మూడేండ్లలో రైతుల సమస్యలపై పోరాటాలు చేస్తామన్నారు. అనంతరం తెలంగాణ రైతు సంఘం కమిటీని ఎన్నుకున్నారు. ఇందులో రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పోతినేని సుదర్శన్, తీగల సాగర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కమిటీని 93 మందితో ఎన్నుకున్నట్టు పేర్కొన్నారు.