నేషనల్ జూనియర్ సెయిలింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో లాహిరికి గోల్డ్‌‌‌‌

నేషనల్ జూనియర్ సెయిలింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో లాహిరికి గోల్డ్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: నేషనల్ జూనియర్ సెయిలింగ్ చాంపియన్‌‌‌‌షిప్‌‌‌‌లో తెలంగాణ సెయిలర్స్‌‌‌‌ పతకాల మోత మోగించారు. ముంబైలోని మార్వేలో జరిగిన ఈ టోర్నీలో హైదరాబాద్‌‌‌‌కు చెందిన లాహిరి కొమరవెల్లి అండర్-16 సబ్ జూనియర్‌‌‌‌‌‌‌‌ విభాగంలో గోల్డ్ నెగ్గింది. మొత్తం 9 రేసుల రెగెట్టాలో13 పాయింట్లతో  నేషనల్ చాంపియన్‌‌‌‌గా నిలిచింది. 

తనూజ కామేశ్వర్– శ్రవణ్ కత్రావత్‌‌‌‌లు జూనియర్ డబుల్ హ్యాండర్ విభాగంలో విజేతలుగా నిలవగా..  అండర్-15 బాయ్స్‌‌‌‌లో బన్నీ బొంగూర్ గోల్డ్ నెగ్గాడు. మహ్మద్ రిజ్వాన్ సిల్వర్‌‌‌‌‌‌‌‌, రవి కుమార్ బ్రాంజ్ గెలిచారు. అమ్మాయిల్లో చంద్రలేఖ తట్టారి  కాంస్య పతకం సాధించింది.