స్కూల్​ ఎడ్యుకేషన్ క్యాలెండర్ విడుదల

స్కూల్​ ఎడ్యుకేషన్ క్యాలెండర్ విడుదల
  • స్కూల్​ ఎడ్యుకేషన్ క్యాలెండర్ విడుదల
  • ఏప్రిల్ 25 నుంచి జూన్ 11 వరకు సమ్మర్ హాలీడేస్​  
  • ప్రతి రోజు ఐదు నిమిషాలు తప్పకుండా యోగా
  • మూడో శనివారం నో బ్యాగ్ డే

హైదరాబాద్,వెలుగు:  రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ అకడమిక్ క్యాలెండర్ బుధవారం రిలీజైంది. బడులు తెరిచిన 16 రోజుల తర్వాత 2022–23 అకడమిక్ క్యాలెండర్​ను విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీచేశారు. ఈ అకడమిక్ ఇయర్​లో మొత్తం 230 వర్కింగ్ డేస్ ఉంటాయని ప్రకటించారు.  స్కూళ్లల్లో ప్రతి రోజు ఐదు నిమిషాలు తప్పకుండా యోగా.. మెడిటేషన్ నిర్వహించాలని ఆమె తెలిపారు. ప్రతి నెలా మూడో శనివారం నో బ్యాగ్ డే నిర్వహించాలనీ.. ప్రతి నెలా నాల్గో శనివారం స్వచ్ఛ స్కూల్/ హరితహారం చేపట్టాలని స్పష్టం చేశారు. జూన్ 13 నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 24 వరకు అకడమిక్ ఇయర్ కొనసాగనుందని వెల్లడించారు. ఏప్రిల్ 25 నుంచి జూన్11 వరకు సమ్మర్ హాలీడేస్ ఉంటాయని చెప్పారు.  పదో తరగతి సిలబస్ జనవరి 10లోపు, మిగిలిన తరగతుల సిలబస్ ను ఫిబ్రవరి 28 వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. ఆగస్టు ఫస్ట్, సెకండ్ వారాల్లో  స్కూల్ లెవెల్ గేమ్స్ , జోనల్ టోర్నమెంట్స్ ఆగస్టు థర్డ్ వీక్, జిల్లా స్పోర్ట్స్ మీట్స్ సెప్టెంబర్​ సెకండ్ వీక్​లో నిర్వహించాలని సూచించారు. 

ఎగ్జామ్స్ షెడ్యూల్ ఇదీ..

ఫార్మాటీవ్ అసెస్​మెంట్(ఎఫ్ఏ)1 పరీక్షలను జులై 21లోగా, ఎఫ్​ఏ2 పరీక్షలను సెప్టెంబర్ 5లోగా, ఎఫ్​ఏ3 పరీక్షలను డిసెంబర్ 21లోపు పూర్తి చేయాలని అకడమిక్ క్యాలెండర్ లో తెలిపారు. ఎఫ్​ఏ 4 ఎగ్జామ్స్ టెన్త్ స్టూడెంట్లకు జనవరి 31లోపు, 9వ తరగతి వరకు ఫిబ్రవరి 28 లోపు పూర్తి చేయాలి.  సమ్మెటీవ్ అసెస్​మెంట్ (ఎస్​ఏ)–1 పరీక్షలు నవంబర్ 1 నుంచి 7 వరకూ, ఎస్​ఏ2 ఎగ్జామ్స్ 9వ తరగతి వరకు ఏప్రిల్ 10 నుంచి 17 వరకు జరుగుతాయి. టెన్త్ ఫ్రీఫైనల్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28లోపు నిర్వహించాలి. ఎస్​ఎస్​సీ ఎగ్జామ్స్ మార్చిలో ఉంటాయి. 

పండగ సెలవులు..

దసరా సెలవులు: సెప్టెంబర్ 26 నుంచి అక్టోబర్ 9 వరకు (14రోజులు) 
క్రిస్మస్ సెలవులు(మిషనరీ):డిసెంబర్ 22 నుంచి 28 వరకు (7రోజులు) 
సంక్రాంతి:2023 జనవరి 13 నుంచి 17 వరకు

టెట్ ఫైనల్ కీ రిలీజ్

టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ ఫైనల్ కీని టెట్ కన్వీనర్ రాధా రెడ్డి బుధవారం విడుదల చేశారు. జులై 1న టెట్ ఫలితాలను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామన్నారు. టెట్ ఫైనల్ కీ ఆలస్యం వల్లే జూన్ 27న ఫలితాలు విడుదల చేయలేకపోయామని వివరించారు.

ఇయ్యాల టెన్త్ రిజల్ట్

రాష్ట్రంలో టెన్త్​ ఫలితాలు గురువారం విడుదల కానున్నాయి. హైదరాబాద్ లో ఉదయం 11.30 గంటలకు మంత్రి సబితారెడ్డి రిజల్ట్ ప్రకటించనున్నారు. విద్యార్థులు bse.telangana.gov.in, bseresults.telangana.gov.in వెబ్ సైట్ల ద్వారా రిజల్ట్ చూసుకోవాలని అధికారులు సూచించారు.