దసరా సెలవుల్లోనూ ఆధార్ సేవలు..ఎంఈవో ఆఫీసులు, ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక కేంద్రాలు

దసరా సెలవుల్లోనూ ఆధార్ సేవలు..ఎంఈవో ఆఫీసులు, ఇంటర్ కాలేజీల్లో ప్రత్యేక కేంద్రాలు

హైదరాబాద్, వెలుగు: దసరా సెలవుల్లో విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం మండల కేంద్రాల్లో ప్రత్యేకంగా ఆధార్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ తెలిపారు. సమగ్ర శిక్ష, స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ప్రతి మండలంలోని ఎంఈవో ఆఫీసుతో పాటు సర్కారు జూనియర్ కాలేజీల్లో ప్రత్యేక ఆధార్ కిట్లను ఏర్పాటు చేసినట్టు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ కేంద్రాల ద్వారా ఇప్పటివరకు ఆధార్ కార్డు లేని చిన్నారులకు కొత్త నమోదుతో పాటు, విద్యార్థులకు తప్పనిసరిగా అవసరమైన మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్స్, సాధారణ ప్రజలకు అవసరమైన ఇతర ఆధార్ సేవలను యూఐడీఏఐ మార్గదర్శకాలకు అనుగుణంగా అందించనున్నట్టు స్పష్టం చేశారు. 

ఆధార్ క్యాంపుల వివరాలను ఎంఈవోలు వెంటనే స్కూల్ హెడ్మాస్టర్లకు చెప్పాలని సూచించారు. ప్రధానంగా బయోమెట్రిక్ అప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డేట్ పెండింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్టూడెంట్ల పేరెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సమాచారం అందించి సెలవుల్లోనే ఈ ప్రక్రియ పూర్తయ్యేలా చూడాలని ఆదేశించారు. మరోవైపు, ఈ సేవల కోసం యూఐడీఏఐ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని, ఉచితంగా అందించే సేవలకు ఎలాంటి ఫీజులూ వసూలు చేయరాదని తేల్చిచెప్పారు. నిబంధనలు అతిక్రమించి అదనపు లేదా అనధికారిక వసూళ్లకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.