జులై 12వ తేదీ స్కూళ్లు, కాలేజీలు బంద్..ఎందుకంటే

జులై 12వ తేదీ స్కూళ్లు, కాలేజీలు బంద్..ఎందుకంటే

రాష్ట్రంలో విద్యారంగ సమస్యల పరిష్కారానికి విద్యార్థి సంఘాలు కదం తొక్కాయి. విద్యారంగంలో సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని  డిమాండ్ చేస్తూ జులై 12వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీల బంద్ లకు పలు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి. 

ఏ ఏ సంఘాలు పిలుపునిచ్చాయంటే..

స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), ఆల్ ఇండియా స్టూడెంట్స్ ఫెడరేషన్ (AISF), ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ యూనియన్ (PDSU), ఆల్ ఇండియా డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ (AIDSO), ఆల్ ఇండియా స్టూడెంట్స్ బ్లాక్ (AISB) తెలంగాణ విభాగాలు ఇండియా ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (AIPSU), ఆల్ ఇండియా ఫెడరేషన్ ఆఫ్ డెమోక్రటిక్ స్టూడెంట్స్ (AIFDS) తెలంగాణలో జులై 12వ తేదీన స్కూళ్లు, కాలేజీల బంద్ కు పిలుపునిచ్చాయి. 

డిమాండ్లు ఏంటంటే..

  • విద్యార్థులకు రెండు జతల యూనిఫారాలు అందించడంతో పాటు పెండింగ్‌లో ఉన్న పాఠ్యపుస్తకాల పంపిణీని పూర్తి చేయడం.
  • ఉపాధ్యాయులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది ఖాళీలను భర్తీ చేయడంతోపాటు ' మన ఊరు  మన బడి పథకాన్ని' అన్ని పాఠశాలలకు విస్తరించడంతోపాటు సరైన నిధులను అందించడం
  • అన్ని పాఠశాలల్లో ఖాళీగా ఉన్న స్కావెంజర్లు, క్లీనింగ్ సిబ్బందిని భర్తీ చేయడంతోపాటు మరుగుదొడ్లు నిర్మించాలి.
  • విద్యార్థుల నుంచి విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్న ప్రయివేటు పాఠశాలలను నియంత్రించేందుకు సరైన చట్టాలు తీసుకురావాలి