- టీడీఆర్‌లో మార్పులు చేసిన సర్కారు
- జీవో నెంబర్. 95 జారీ చేసిన పట్టణాభివృద్ధిశాఖ
- రోడ్డు వెడల్పు ఆధారంగా అదనపు ఫ్లోర్స్‌కు అవకాశం
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎక్కడైనా 21 మీటర్ల కంటే ఎత్తుగా బిల్డింగ్స్ నిర్మిస్తే వాటిని హైరైజ్ భవనాలుగా గుర్తిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పట్టణాభివృద్ధి శాఖ 2012లో జారీ చేసిన తెలంగాణ బిల్డింగ్ రూల్స్‌కు సవరణలు చేశారు. కొత్తగా ట్రాన్స్ఫరేబుల్డెవలప్మెంట్రైట్స్(టీడీఆర్) సవరణలు చేస్తూ ఈనెల 21న జీవో నెంబర్ 95 రిలీజ్ చేశారు. రాష్ట్రంలో రియల్ఎస్టేట్రంగాన్ని మరింతగా ప్రొత్సహించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. సెట్‌బ్యాక్ సడలింపులను అంగీకరించారు. నాన్ -హైరైజ్ భవనాలకు సైతం సెట్‌బ్యాక్ రిలాక్సేషన్ అవకాశం ఇచ్చారు. 750 నుంచి 2,000 చదరపు మీటర్ల ప్లాట్లలో టీడీఆర్ ద్వారా బిల్డింగ్ ఎత్తు పెంచుకునే అవకాశం కల్పించారు. ఈ మేరకు పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ఉత్తర్వులు జారీ చేశారు.
టీడీఆర్‌తో అదనపు ఫ్లోర్లు పెంచుకునే అవకాశం..
టీడీఆర్ద్వారా అదనపు ఫ్లోర్లు (ఎత్తు పెంపు), బిల్ట్- అప్ ఏరియా పెంచుకోవడానికి మరిన్ని అవకాశాలు కల్పించారు. 10 నుంచి 20 అంతస్తుల భవనాలకు నిర్దిష్ట శాతం టీడీఆర్ వినియోగించుకొని 3 శాతం వరకు అదనపు బిల్ట్- అప్ ఏరియా పెంచుకోవచ్చు. 20 అంతస్తులు దాటిన భవనాలకు 5 శాతం , హై-రైజ్ భవనాల్లో 10 శాతం వరకు సెట్‌బ్యాక్ రిలాక్సేషన్ అనుమతి ఇచ్చారు.
చెరువులు, నదులు, నాలాల బఫర్ జోన్లలో భూములకు టీడీఆర్ ఆఫర్లు పెంచారు. 200 శాతం నుంచి 400 శాతం వరకు బిల్ట్ -అప్ ఏరియా సమానం చేశారు. 10 అంతస్తులు దాటిన భవనాలకు 10 శాతం బిల్ట్ -అప్ ఏరియాకు టీడీఆర్‌ను తప్పనిసరి చేశారు. 2000 స్వేర్ మీటర్ల కంటే ఎక్కువ ఉన్న ప్లాట్లకు రోడ్ వెడల్పు ఆధారంగా అదనపు అంతస్తులు పెంచుకునే అవకాశం ఇచ్చారు. 40 ఫీట్ల రోడ్డు ఉంటే గరిష్టంగా మూడు అదనపు ఫ్లోర్స్, 60 ఫీట్ల రోడ్ఉంటే 4 అదనపు ఫ్లోర్స్, 80 ఫీట్ల రోడ్ ఉంటే 5 అదనపు ఫ్లోర్స్ పెంచుకోవచ్చు. వీటికి టీడీఆర్వినియోగం తప్పనిసరి చేశారు. బిల్డర్లు, డెవలపర్లు, రియల్ ఎస్టేట్ సంఘాలు నుంచి వచ్చిన రిక్వెస్ట్‌లను పరిశీలించిన తర్వాత ప్రభుత్వం ఈ ఉత్తర్వులను జారీ చేసింది. కోర్ అర్బన్ ఏరియాలో(క్యూర్) టీడీఆర్వినియోగాన్ని క్రమబద్ధీకరించడం, భవన నిర్మాణాలకు మరిన్ని అవకాశాలు కల్పించడం, రియల్ ఎస్టేట్ రంగాన్ని బూస్ట్ చేయడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుంది.
