న్యూఢిల్లీ / భోపాల్: ఒలింపిక్ సెలెక్సన్ ట్రయల్స్–3లో తెలంగాణ షూటర్ ఇషా సింగ్ టాప్ ప్లేస్ సాధించింది. ఆదివారం జరిగిన విమెన్స్ 25 మీటర్ల పిస్టల్ ఫైనల్స్‌లో 43 పాయింట్లు సాధించి రెండో విజయం ఖాతాలో వేసుకుంది. ఈ నెల ఆరంభంలో బాకూ వరల్డ్ కప్‌లో కిమ్ యిజీ (కొరియా) నెలకొల్పిన వరల్డ్ రికార్డు కంటే ఒక పాయింట్ ఎక్కువ కావడం విశేషం. ఇక ఢిల్లీలో జరిగిన ట్రయల్స్–2లోనూ ఇషా గెలిచింది. మను భాకర్ (40), రిథమ్ సాంగ్వాన్ (33) 2,3వ స్థానాల్లో నిలిచారు.
