లాలాపేట్, వెలుగు: తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అందించిన అందెశ్రీ.. లాలాపేటలో 50 గజాల్లోని ఓ పాత ఇంటిలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద బిడ్డ వెన్నెల టీచర్.. రెండో బిడ్డ వాక్కులమ్మ, మూడో కుమార్తె వేకువ ప్రైవేట్ జాబ్స్చేస్తున్నారు.
కొడుకు దత్త సాయి పీజీ చదువుతున్నాడు. అందెశ్రీ లాలాపేటలో ఉండడానికి ఒక కారణం ఉంది. ఇక్కడికి ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర. ఎప్పుడూ వర్సిటీకి వెళ్లి తన కవితలు, పాటలతో విద్యార్థులను ఉత్తేజపరుస్తుండేవారు. 30 ఏండ్లుగా ఆయన ఓయూతో అనుబంధం పెంచుకున్నారు. ఆయన కన్నుమూశారని తెలియడంతో ఓయూ విద్యార్థి లోకం విషాదంలో మునిగిపోయింది.
