6 నుంచి అసెంబ్లీ సమావేశాలు

6 నుంచి అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 6 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 6 వ తేదీ ఉదయం 11.30 కు సెషన్ మొదలు కానుంది. అటు శాసన మండలి సమావేశాలు కూడా అదే రోజు ప్రారంభం అవుతాయని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు వెల్లడించారు.  ఈ మేరకు ఓ ప్రకటన రిలీజ్ చేశారు. సమావేశాలు ఎన్ని రోజులు జరగాలనే దానిపై మొదటి రోజు బీఏసీ సమావేశంలో నిర్ణయం తీసుకోనుంది. వివిధ అంశాలపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. సడెన్ గా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం హాట్ టాపిక్ అవుతోంది. మునుగోడు ఉప ఎన్నికకు టైం దగ్గర పడుతున్న సందర్బంలో.. ఒకే రోజు కేబినెట్, టీఆర్ఎస్ ఎల్పీ సమావేశాలు నిర్వహిస్తుండటం ఇంట్రస్టింగ్ గా మారింది.

సీఎం కేసీఆర్ కార్యాచరణ అంతా మునుగోడు కోసమా లేక ముందస్తు ఎన్నికలకు వెళ్ళే వ్యూహమా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. జరుగుతున్న పరిణామాలు డిఫరెంట్ గా ఉండటంతో ఈ సమావేశాల్లో ఏ అంశాలు చర్చిస్తారనే చర్చ జరుగుతోంది. కేసీఆర్ కు సెప్టెంబర్ సెంటిమెంట్ కూడా ఉండటంతో జరుగుతున్న చర్చలకు బలం చేకూరుతుంది.