వాతావరణ శాఖ తెలంగాణకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల జాబితాలో కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి , భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, ములుగు , మహబూబాబాద్, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ , జనగామ ఉన్నాయి. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్న జిల్లాల కేటగిరిలో అదిలాబాద్, నిర్మల్ ,నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట్ ,సంగారెడ్డి , మెదక్, కామారెడ్డి ఉన్నాయి. భారీ వర్షాలు కురిసే అవకాశమున్న జిల్లాల కేటగిరిలో ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట , యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలు ఉన్నాయి.
