ఆరోగ్యశాఖకు ఆపరేషన్​.. డైరెక్టర్ సహా అందర్నీ మార్చే యోచనలో ప్రభుత్వం

ఆరోగ్యశాఖకు ఆపరేషన్​.. డైరెక్టర్ సహా అందర్నీ మార్చే యోచనలో ప్రభుత్వం
  • డైరెక్టర్ సహా అందర్నీ మార్చే యోచనలో ప్రభుత్వం
  • అధికారులపై అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలతో అలర్ట్
  • పలు ఆఫీసుల్లో ఏండ్లుగా తిష్టవేసిన అధికారులపై ఫోకస్​

హైదరాబాద్, వెలుగు: ప్రజారోగ్య శాఖలో జరుగుతున్న అవినీతిపై రాష్ట్ర సర్కారు ఫోకస్ పెట్టింది. ఇటీవల వరుసగా డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు, ఇతర ఉన్నతాధికారులపై అవినీతి, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎన్నికల కోడ్ తర్వాత మొత్తం వ్యవస్థను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. ఆరోగ్యశాఖ డైరెక్టర్ సహా అన్ని జిల్లాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోలు, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ఆఫీసుల్లో ఏండ్లుగా తిష్టవేసి అవినీతికి పాల్పడుతున్న అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు వేయాలని యోచిస్తోంది. హెల్త్ డైరెక్టరేట్ హెడ్ ఆఫీసులోనూ కొంత మంది అధికారులు ఏండ్లుగా పాతుకుపోయి, అవినీతి, లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్టు సర్కార్ గుర్తించింది. ఈ నేపథ్యంలో హెడ్ ఆఫీసు అధికారులను కూడా బదిలీ చేయనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రౌండ్ వర్క్ మొదలైనట్టుగా ఆ శాఖ ఉన్నతాధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆరోగ్యశాఖ ఇన్ చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా రవీందర్ నాయక్ కొనసాగుతున్నారు. రాష్ట్ర విభజన తర్వాత హెల్త్ డైరెక్టర్ పోస్టు ఏపీకి వెళ్లిపోయింది. బీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఎస్ సర్కార్ ఆ పోస్టును క్రియేట్ చేయకుండా ఇన్​చార్జ్ డైరెక్టర్లతోనే నెట్టుకొచ్చింది. కొత్తగా డైరెక్టర్ పోస్టును క్రియేట్ చేసి, పూర్తిస్థాయి డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను నియమించేందుకు సర్కారు చర్యలు ప్రారంభించింది. ఈ పోస్టులో కొత్త అధికారిని నియమించి, ఆ తర్వాత బదిలీలు చేపట్టే అవకాశం ఉంది.

ఆఫీసుల్లో అవినీతి కంపు

ఆరోగ్యశాఖలో ఓ వైపు లైంగిక వేధింపులు.. మరోవైపు అవినీతి కంపు కొడుతోంది. డిప్యుటేషన్ కోసం వెళ్తే పబ్లిక్ హెల్త్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రవీందర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మెదక్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో చందూ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డబ్బులు డిమాండ్ చేశారని ఓ మహిళా ఉద్యోగి ఆరోపించింది. డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వోకు డబ్బులు పంపించిన ఆధారాలను కూడా బయటపెట్టింది. ఈ ఆరోపణలను డీహెచ్, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ఇద్దరూ ఖండించారు. తప్పుడు ఆరోపణలు చేసిందన్న కారణంతో సదరు మహిళను సస్పెండ్ చేశారు. అయితే, ఆమె వద్ద ఆధారాలు ఉండడంతో ఈ కేసును ఏసీబీ టేకప్ చేసి.. ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చింది. దీంతో సర్కారు మెదక్ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో పోస్టు నుంచి చందూ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్ చేసి మరొకరికి బాధ్యతలు అప్పగించింది. గతేడాది చివరిలో చందూనాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసులో పనిచేసే ఫహీం పాషా అనే సీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఏడాది జనవరిలో జనగామ డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ప్రశాంత్.. అదే ఆఫీసులో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ అస్గర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఓ ఫార్మాసిస్ట్ వద్ద రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు. గతేడాది చివరిలో మంచిర్యాల డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ఆఫీసులో రూ.10 వేలు లంచం తీసుకుంటూ ముగ్గురు అధికారులు ఏసీబీ ట్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పడ్డారు. ఇవి కొన్ని కేసులే కాగా.. ప్రతి జిల్లాలోనూ అవినీతి పేరుకుపోయినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలోనే హెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసు, డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ఆఫీసుల్లో పాతుకుపోయిన అధికారులు, సిబ్బందిపై బదిలీ వేటు వేయాలని సర్కార్ యోచిస్తోంది.

మహిళా ఉద్యోగులపై పెరుగుతున్న వేధింపులు

రాష్ట్రంలో అత్యధికంగా మహిళా ఎంప్లాయీస్ ఉన్న డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆరోగ్యశాఖ. ఇలాంటి డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోనే మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతున్నాయి. కామారెడ్డి డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సింగ్ తన కింద పీహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీలలో పనిచేసే మహిళా డాక్టర్లతో అసభ్యంగా ప్రవర్తించడం, లైంగికంగా వేధించడంతో డాక్టర్లంతా రోడ్డెక్కారు. ఏకంగా ఐదుగురు మహిళా డాక్టర్లు ఆయనపై కలె క్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు, ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో సర్కార్ ఎంక్వైరీకి ఆదేశించింది. ఆరోపణలు నిజమని తేల డంతో లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్ చేసి.. పోలీస్ కేసు కూడా నమోదు చేశారు. అదే జిల్లా డీఎంహెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వో ఆఫీసులో పనిచేసే ఆఫీస్ సూపరింటెండెంట్ శ్రీనివాస్ నాయక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సైతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై వచ్చిన ఆరోపణల మీద డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంక్వైరీ జరుగుతోంది. కామారెడ్డి ఘటన కంటే ముందే ఆరోగ్యశాఖ హెడ్ ఆఫీసులో పనిచేసే ఆఫీస్ సూపరింటెండెంట్ సలావుద్దీన్ మీద కూడా లైంగిక ఆరోపణలు వచ్చాయి. వివిధ పనుల కోసం హెడ్ ఆఫీసుకు వస్తున్న నర్సులను ఆయన లైంగికంగా వేధించడంతో పలువురు నర్సులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని ఓ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పనిచేసే నర్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆయన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఆత్మహత్య కేసులో సలావుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెయిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తెచ్చుకున్నాడు. ఇదిలా ఉండగానే ఆయన మరో నర్సును లైంగికంగా లోబర్చుకుని, బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెయిల్ చేయడంతో ఆమె ఆరోగ్యశాఖ మంత్రి, సీఎం వోకు ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదుపై ఎంక్వైరీకి ఆదేశించింది. ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలడంతో మూడు రోజుల క్రితమే సలావుద్దీన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.