
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో 2019-20 ఏడాదికి గాను బడ్జెట్ ను ప్రవేశపెట్టింది. దేశంలో ఉన్న ఆర్థిక మాంద్య పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కేటాయింపుల అంచనాలను తక్కువగా చేసినట్టు సీఎం చెప్పారు. పరిస్థితుల్లో మార్పులు వస్తే బడ్జెట్ లో కేటాయింపుల అంచనాలు మార్చుకునే వెసులుబాటు ఉందని చెప్పారు.
ఆర్థిక మాంద్య పరిస్థితులు ఉన్నప్పటికీ వ్యవసాయం, రైతుల విషయంలో కేటాయింపులు భారీగానే చేశామని చెప్పారు సీఎం కేసీఆర్. ఇది వ్యవసాయం, రైతుపట్ల తమ చిత్తశుద్ధిని చెప్పకనే చెబుతోందని అన్నారు.