33 జిల్లాల నుంచి163 ఇన్నోవేషన్లు

33 జిల్లాల నుంచి163 ఇన్నోవేషన్లు

హైదరాబాద్​, వెలుగు : తెలంగాణ అంతటా ఇన్నోవేషన్ కల్చర్​ను ఎంకరేజ్​చేయడానికి తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ (టీఎస్​ఐసీ) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల్లో ‘ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ 2022’  నాలుగో ఎడిషన్‌‌‌‌‌‌‌‌ను నిర్వహించింది.  రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 163 ఇన్నోవేషన్లను ఈ సందర్భంగా ఎంపిక చేశారు.  సామాజిక సమస్యలకు పరిష్కారాలను రూపొందించడానికి, స్థానిక ఇన్నోవేటర్లను ఎంకరేజ్​ చేయడానికి టీఎస్​ఐసీ రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని రెండున్నర నెలలపాటు చేపట్టింది.  కార్యక్రమంలో గ్రామాలు, స్కూళ్లు, కాలేజీలు,  స్టార్టప్‌‌‌‌‌‌‌‌లు, ఇండస్ట్రియల్,  వ్యవసాయం సహా విభిన్న రంగాలకు చెందిన ఇన్నోవేటర్లు పాల్గొన్నారు. వాట్సాప్ నంబర్ ద్వారా ఎంట్రీలను ఆహ్వానించగా 700లకుపైగా వచ్చాయి. 163 ఇన్నోవేషన్లను సంబంధిత జిల్లా కలెక్టర్లకు ప్రదర్శించడానికి షార్ట్‌‌‌‌‌‌‌‌లిస్ట్ అయ్యాయి. వీరికి ఫండింగ్​, మార్కెట్​ యాక్సెస్​ వంటి సదుపాయాలు కల్పిస్తారు.

ఈ సంవత్సరం  ఏసీఐసీ– సీబీఐసీ, గ్రామ బజార్, పల్లె సృజన, వోక్సెన్​ యూనివర్సిటీ, కాకతీయ శాండ్‌‌‌‌‌‌‌‌బాక్స్, రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్  ఆల్ ఇండియా రోబోటిక్స్ అసోసియేషన్‌‌‌‌‌‌‌‌తో టీఎస్​ఐసీ చేతులు కలిపింది. అట్టడుగు స్థాయిలో ఇన్నోవేషన్లను ఎంకరేజ్​ చేయడానికి యాదాద్రి భువనగిరి, బిట్స్​ వరంగల్, ఆర్​జీయూకేటీ, - బాసర,  జోగులాంబ గద్వాల్ జిల్లాలో పాఠశాలలు,  కళాశాలలతో సహా 1000 మందికి పైగా విద్యార్థులతో రోడ్‌‌‌‌‌‌‌‌షోలు నిర్వహించారు. ఈ విషయమై తెలంగాణ ఐటీ, మున్సిల్​ డెవెలప్​మెంట్​, ఇండస్ట్రియల్​ డెవెలమెంట్స్​శాఖల మంత్రి కేటీఆర్​ మాట్లాడుతూ,  కొత్త ఆలోచనలను ప్రోత్సహించడమే కాకుండా  ఇన్నోవేషన్లకు జీవం పోయడానికి తెలంగాణ ప్రభుత్వం అవసరమైన ప్రతి చర్యను తీసుకుంటోందని అన్నారు.  ఇన్నోవేషన్లు రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయని మెచ్చుకున్నారు.