ఇంటి నుంచే ఓటు వేయాలంటే ఏప్రిల్ 23 లోపు దరఖాస్తు: ఎన్నికల కమిషనర్

ఇంటి నుంచే ఓటు వేయాలంటే ఏప్రిల్ 23 లోపు దరఖాస్తు: ఎన్నికల కమిషనర్

తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు విడుదలైంది. ఈమేరకు ఎన్నికల ఏర్పాట్లు అన్నీ పకడ్బందీగా చేశామని, సిబ్బందికి ట్రైనింగ్ ఇచ్చామని ఈసీ వికాస్ రాజ్ మీడియా సమావేశంలో తెలిపారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందితా గత నెల కారు ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. లోక్ సభ స్థానాలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ ఎన్నికలకు కూడా ఏర్పాటు పూర్తి చేసినట్లు ఆయన ప్రకటించారు.   

రాష్ట్రంలో 90వేల పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఎన్నికల్లో విధులు నిర్వహించడానికి లక్షా 80వేల మంది సిబ్బంది అవసరమని ఎలక్షన్  కమిషనర్ తెలిపారు. రాష్ట్రంలో 85 ఏళ్ల పైబడిన వృద్ధుల సంఖ్య లక్షా 85 వేల ఉందన్నారు. ఇంటి నుంచే ఓటు వేయాలనుకునే దివ్యాంగులు, వృద్ధులు ఏప్రిల్ 22 వరకు పోస్టల్ ఓటుకు అప్లై చేసుకోవాలని సూచించారు.  గతేడాది జరిగిన అసెంబ్లీ ఎలక్షన్ లో 2లక్షల 9వేల మందికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశాన్ని కల్పించామని ఆయన తెలిపారు. పోస్టల్ ఓట్ల వివరాలు రీజనల్ ఆఫీసర్ దగ్గర ఉంటాయని వికాస్ రాజ్ అన్నారు.

ALSO READ :-IPL 2024: కింగ్ వచ్చేశాడు: బెంగళూరు క్యాంప్‌లో చేరిన కోహ్లీ