తెలంగాణకు వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

తెలంగాణకు వర్ష సూచన..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

రాష్ట్రంలో నైరుతి రుతపవనాల ప్రభావంతో వానలు దంచికొడుతున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో మోస్తరు వానలు పడుతున్నాయి. రాబోయే 3 రోజుల పాటు కూడా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. 

జూన్ 26వ తేదీ సోమవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములు,మెరుపులతో కూడిన  వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.  ఉత్తర, ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలో వానలు పడే ఛాన్సుందన్నారు. ఈ జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 

రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్లో సాధారణంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. భాగ్యనగరంలో తేలికపాటి నుండి మోస్తరు  వర్షం కురుస్తుందన్నారు. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే ఛాన్సుందని వెల్లడించారు. 

మొత్తంగా రాబోయే మూడు రోజుల పాటు నైరుతి రుతుపవనాలతో ప్రభావంతో  ఉపరితల గాలులు నైరుతి  దిశలో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.