ఈవీలపై ‘గో ఎలక్ట్రిక్‌‌  క్యాంపెయిన్‌‌’

ఈవీలపై ‘గో ఎలక్ట్రిక్‌‌  క్యాంపెయిన్‌‌’

హైదరాబాద్‌‌, వెలుగు: ఎలక్ట్రిక్‌‌ వాహనాలపై అవగాహన కల్పించేందుకు టీఎస్‌‌ రెడ్‌‌కో ‘గో ఎలక్ట్రిక్‌‌ క్యాంపెయిన్‌‌’ నిర్వహిస్తోంది. డిసెంబర్‌‌11న నెక్లెస్‌‌రోడ్‌‌లోని పీపుల్స్‌‌ ప్లాజా నుంచి రోడ్‌‌షో నిర్వహించనున్నారు. గురువారం టీఎస్‌‌ రెడ్‌‌కో ఆఫీస్‌‌లో ఎండీ జానయ్య మీడియాతో మాట్లాడారు. శని, ఆదివారాల్లో నిర్వహించే క్యాంపెయిన్‌‌లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. డిసెంబరు 11న ఉదయం 9.30 నుంచి 12గంటల దాకా రోడ్‌‌ షో, ప్రోగ్రామ్స్ ఉంటాయన్నారు. డిసెంబర్‌‌ 12న నెక్లెస్‌‌రోడ్‌‌ పీపుల్స్‌‌ ప్లాజాలో ఈవీలపై ఎగ్జిబిషన్‌‌ ఉంటుందన్నారు. కార్బన్‌‌ ఎమిషన్స్‌‌ తగ్గించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈవీలకు ఇన్సెంటివ్స్ ఇచ్చి ప్రమోట్‌‌ చేస్తున్నాయరు. 

ఈవీలకు సబ్సిడీ..
ఈవీలకు కిలోవాట్‌‌కు రూ.15వేల చొప్పున ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తున్నాయని జానయ్య తెలిపారు. ఎగ్జిబిషన్​లో ఏ వాహనాలకు ఎంత సబ్సిడీ పొందవచ్చో తెలుసుకోవచ్చాన్నారు. రిజిస్ట్రేషన్‌‌ చార్జీల మినహాయింపుతో పాటు, రాయితీలు అందిస్తున్నటు చెప్పారు. టూవీలర్‌‌ బ్యాటరీ 2కిలో వాట్ల నుంచి 3కిలో వాట్ల వరకు, త్రీవీలర్‌‌ ఆటోలు 4కిలోవాట్ల నుంచి 8కిలో వాట్ల వరకు, ఫోర్‌‌ వీలర్లు 20 కిలోవాట్ల నుంచి 70 కిలోవాట్ల వరకు ఉంటాయన్నారు.

చార్జింగ్‌‌ స్టేషన్లు పెంచుతాం 

రాష్ట్రంలో చార్జింగ్‌‌ స్టేషన్‌‌లు, పాయింట్లను పెంచుతున్నామని జానయ్య తెలిపారు. హైదరాబాద్‌‌లో118, వరంగల్‌‌, కరీంనగర్‌‌లో 10 చొప్పున 138 చార్జింగ్‌‌ స్టేషన్‌‌లు ఉన్నాయని తెలిపారు. హెచ్‌‌పీ, ఇండియన్‌‌ ఆయిల్‌‌ కంపెనీలతో టై అప్‌‌ అయి బంకుల్లోనూ ఈవీలకు చార్జింగ్‌‌ సౌలత్​లు పెంచుతామన్నారు.