రిపబ్లిక్​ డే పరేడ్​కు​ రాష్ట్ర శకటం ఎంపిక

రిపబ్లిక్​ డే పరేడ్​కు​ రాష్ట్ర శకటం ఎంపిక

హైదరాబాద్, వెలుగు: రిపబ్లిక్ డే సందర్భంగా వచ్చే నెల 26న ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో జరిగే పరేడ్​కు రాష్ట్ర శకటం ఎంపికైంది. మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరను ప్రతిబింబించే ఈ శకటంపై వేయి స్తంభాల గుడి, బతుకమ్మ వైభవం కూడా కొలువుదీరనున్నాయి. పరేడ్​లో మేడారం జాతర రూపకాన్ని కళాకారులు ప్రదర్శించనున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక రాజ్​పథ్​ పరేడ్​కు రాష్ట్ర శకటం ఎంపిక కావడం ఇది రెండోసారి.  2015లో తొలిసారి అవకాశం దక్కింది. అటు తర్వాత బతుకమ్మ, మేడారం జాతర ఆకృతితో శకటాల నమూనాలు పంపించినప్పటికీ ఎంపిక కాలేదు. ఈసారి శకటం సెలెక్ట్​ కావడంపై హర్షం వ్యక్తమవుతోంది. శకటం నమూనాను ఢిల్లీ తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్  ఉప్పల్ గురువారం మీడియాకు విడుదల చేశారు. సెలక్షన్ కమిటీ నుంచి అఫీషియల్ లెటర్​ కోసం ఎదురు చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.