కేరళలో కరీంనగర్ విద్యార్థి మృతి

కేరళలో కరీంనగర్ విద్యార్థి మృతి

కేరళలో  విహారయాత్రకు వెళ్లిన తెలంగాణ విద్యార్థి జలపాతంలో పడి మృతి చెందాడు . కరీంనగర్ కు చెందిన  శ్రీ హర్ష అనే విద్యార్థి కోయంబత్తూరులోని అమృత పీఠం ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. 13న కాలేజీకి  చెందిన 60 మంది విద్యార్థులతో కలిసి టూర్ కు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కొట్టాయం వద్ద మర్రి మాల్ జలపాతంలో జారీ పడి మృతి చెందాడు. శ్రీ హర్ష మృతదేహాన్ని జాలర్లు బయటకు తీసారు.