స్టోక్ కాంగ్రీ పర్వతం ఎక్కిన రాష్ట్ర విద్యార్థులు

స్టోక్ కాంగ్రీ పర్వతం ఎక్కిన  రాష్ట్ర విద్యార్థులు

బేస్​క్యాంపు వద్ద  భారీ జాతీయ జెండా ఆవిష్కరణ

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర విద్యార్థులు సరికొత్త ఘనత సాధించారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈనెల 15న లడాఖ్​లోని 6,153 మీటర్ల స్టోక్ కాంగ్రీ పర్వతాన్ని అధిరోహించారు. పర్వతం బేస్ క్యాంప్ వద్ద 365 అడుగుల భారీ జాతీయ జెండాను ఆవిష్కరించి రికార్డు సృష్టించారు. రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా ఎల్లికల్ గ్రామానికి చెందిన బీటెక్ స్టూడెంట్ మల్లికార్జున్, హన్మకొండకు చెందిన స్టూడెంట్ ఆర్.అఖిల్ ఈ సాహయ యాత్రను పూర్తి చేశారు. పర్వతారోహణపై మక్కువ, దేశ ఖ్యాతిని చాటాలనే లక్ష్యంతో ఈ యాత్ర చేపట్టినట్లు వారు తెలిపారు. 365 అడుగుల భారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించారు. సమాజ హితాన్ని కాంక్షిస్తూ పలు బ్యానర్లను ప్రదర్మించినట్లు చెప్పారు. యాత్ర ముగించుకుని బుధవారం ఢిల్లీ చేరుకున్న స్టూడెంట్లు మీడియాకు వివరాలు వెల్లడించారు.

ఏపీ నుంచి సాయికిరణ్…
ఏపీలోని చిలకలూరి పేట సీఆర్ కాలేజీకి చెందిన ఆలూరి సాయికిరణ్ కూడా రాష్ట్ర విద్యార్థులతో కలిసి పర్వతారోహణ చేశాడు.