సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి 200 మంది తెలుగు స్టూడెంట్స్‌‌‌‌

సరిహద్దు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి  200 మంది తెలుగు స్టూడెంట్స్‌‌‌‌

న్యూఢిల్లీ, వెలుగు:  భారత్, పాకిస్తాన్‌‌‌‌ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు రాష్ట్రాల్లో చదువుకుంటున్న తెలంగాణ స్టూడెంట్స్ సురక్షితంగా ఢిల్లీకి చేరుకుంటున్నారు. ఆదివారం దాదాపు 200 మంది విద్యార్థులు ఢిల్లీలోని తెలంగాణ భవన్‌‌‌‌కు చేరుకున్నారు. అనంతరం విద్యార్థులతో తెలంగాణ రెసిడెంట్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ గౌవర్‌‌‌‌ ఉప్పల్‌‌‌‌ మాట్లాడారు. భవన్‌‌‌‌లోనే వీరి కోసం బస, భోజన సౌకర్యాలు ఏర్పాటు చేశారు. విద్యార్థులను వారి సొంతూళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 

అలాగే, విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తెలంగాణ భవన్‌‌‌‌లో హెల్ప్ లైన్‌‌‌‌తో పాటు హెల్త్ క్యాంప్‌‌‌‌ను ఏర్పాటు చేశారు. కాగా, కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినా.. సరిహద్దుల్లో పాకిస్తాన్‌‌‌‌ భారత్‌‌‌‌పై కాల్పులు జరుపుతూనే ఉంది. దీంతో సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ విద్యార్థులు ఇంటి బాట పట్టారు. ఇప్పటికే పంజాబ్, జమ్మూ-కాశ్మీర్ నుంచి చాలా మంది విద్యార్థులు హస్తినకు చేరుకున్నారు.