కోల్బెల్ట్, వెలుగు: తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి, అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాలను కొనసాగించాలని మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియా సింగరేణి జీఎం ఎన్.రాధాకృష్ణ అన్నారు. సింగరేణి మాజీ ఉద్యోగి, కోలిండియా కళాకారుడు సకినాల రాజేశ్వర్రూపొందించిన 'తెలంగాణ తల్లి' అడియోను ప్రముఖ టీవీ నటుడు, జబర్దస్త్ ఫేమ్ వెంకీతో కలిసి జీఎం రాధాకృష్ణ–శ్రీవాణి దంపతులు మంగళవారం రాత్రి మందమర్రిలోని ఇల్లందు క్లబ్లో ఆవిష్కరించారు.
వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అమరవీరులు చేసిన త్యాగాలను నేటి తరానికి గుర్తుచేసేలా ఆడియో రూపొందించడం అభినందనీయమన్నారు. ఉద్యమ సమయంలో ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, త్యాగాలు, తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని రచయిత రాజేశ్వర్పాటలో ప్రతిబింబించే ప్రయత్నం చేశారని కొనియాడారు.
