
హైదరాబాద్, వెలుగు: టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టీఎస్ టెట్–2022) అప్లికేషన్ల గడువు మంగళవారంతో ముగియనున్నది. ఫీజు చెల్లించేందుకు సోమవారమే ఆఖరు రోజు. మార్చి26 నుంచి అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభం కాగా, ఇప్పటికే 4.5 లక్షల వరకూ దరఖాస్తులు అందినట్టు సమాచారం. ఈ సారి ఎస్జీటీ పోస్టులకు బీఈడీ వాళ్లకు కూడా అవకాశమివ్వడంతో పేపర్1కు భారీగా అప్లికేషన్లు వస్తున్నాయి. ఇప్పటికే సుమారు 3 లక్షల వరకూ అప్లికేషన్లు వచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. అయితే మారుమూల ప్రాంతాల్లో నెట్ సరిగా ఉండకపోవడంతో అప్లై చేసుకునేందుకు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. అప్లికేషన్లకు మరో10 రోజులైనా గడువు పెంచాలని కోరుతున్నారు.