టెక్నో కల్చరల్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రూ.55 లక్షలు మంజూరు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి

 టెక్నో కల్చరల్ ఫెస్టివల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు  రూ.55 లక్షలు మంజూరు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
  • మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి వెల్లడి

హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ప్రసాద్ మల్టీప్లెక్స్, హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ వేదికగా టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ నిర్వాహణకు రాష్ట్రప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టీజీఎఫ్‌‌‌‌‌‌‌‌డీసీ) ఆధ్వర్యంలో ఈ నెలాఖరున 'టెక్నో-కల్చరల్ ఫెస్టివల్' జరగనుందని..అందుకోసం రూ.55 లక్షలు మంజూరు చేసినట్లు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 

రాష్ట్రాన్ని దేశంలోని కళలు, సంస్కృతి, సినిమాటోగ్రఫీ రంగాలకు కేంద్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.  టెక్నో-కల్చరల్ ఫెస్టివల్  ద్వారా ఈశాన్య రాష్ట్రాలతో సాంస్కృతిక, సృజనాత్మక బంధాలు మరింత బలపడతాయని తెలిపారు. ఈవెంట్ లో జాతీయ అవార్డు గెలుచుకున్న చిత్రాల ప్రదర్శనలు, ప్యానెల్ చర్చలు, సాంస్కృతిక ప్రదర్శనలు జరుగుతాయని వివరించారు. రాష్ట్రం కల్చరల్ ఎక్స్ఛేంజీకీ కేంద్ర బిందువుగా ఎదుగుతున్నదని తెలిపారు. రాష్ట్ర సినీ–సాంస్కృతిక రంగాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే దిశగా ముందడుగు వేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.