టూరిజంలో పారదర్శకతకు పెద్దపీట : టీజీటీడీసీ వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ మాన్వి

టూరిజంలో పారదర్శకతకు పెద్దపీట : టీజీటీడీసీ వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ మాన్వి
  •     ఎంఐఎస్‌‌తో బోటింగ్ ఆదాయంపై పర్యవేక్షణ
  •     అక్రమాలపై విజిలెన్స్ తనిఖీలు ముమ్మరం:  వాటర్ ప్లీట్ జనరల్ మేనేజర్ మాన్వి 

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర టూరిజం రంగంలో పారదర్శకతను పెంచేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామని, బోటింగ్ ద్వారా వచ్చే ప్రతి పైసాను మేనేజ్‌‌మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఐఎస్) ద్వారా పర్యవేక్షిస్తున్నామని టీజీటీడీసీ వాటర్ ఫ్లీట్ జనరల్ మేనేజర్ మాన్వి సోమవారం ప్రకటనలో తెలిపారు. బోటింగ్‌‌కు వచ్చే ప్రతి ప్రయాణికుడికి నిబంధనల ప్రకారం టికెట్లు జారీ చేస్తున్నామని, రికార్డులన్నీ పద్ధతిగా నిర్వహిస్తున్నామని చెప్పారు. 

టికెట్ లేకుండా బోటింగ్ చేయించడం, నకిలీ ఎంఆర్ బుక్కులు వాడటం వంటివి జరగడం లేదన్నారు.  ఒకవేళ ఎక్కడైనా లోపాలు గుర్తిస్తే విజిలెన్స్ యంత్రాంగంతో పాటు ప్రత్యేక అధికారుల బృందాన్ని పంపి తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. 

బోట్ల కండిషన్​ను నిరంతరం పరిశీలించేందుకు ప్రత్యేక విభాగం పనిచేస్తోందని, చిన్నపాటి రిపేర్ల నుంచి మేజర్​వర్క్స్​ వరకు డాక్యుమెంటేషన్, ఆడిటింగ్ జరుగుతోందని వివరించారు. పర్యాటకుల సంఖ్య, ఆదాయం, ఇంధన వినియోగం, రిపేర్ల ఖర్చులను ఎంఐఎస్ ద్వారా సమగ్రంగా ట్రాక్ చేస్తున్నామని తెలిపారు. బోటింగ్ యూనిట్లపై రెగ్యులర్ తనిఖీలు నిర్వహించి నివేదికలు  సమర్పిస్తారని, లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దుతున్నామని పేర్కొన్నారు. టికెటింగ్ నుంచి ఆదాయం వరకు అన్ని వ్యవహారాల్లో పారదర్శకత పాటిస్తున్నామని, అవసరమైతే అధికారులతో విచారణలు కూడా చేపడుతున్నామని స్పష్టం చేశారు.