
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర పర్యాటక శాఖకు 'బెస్ట్ డెకరేషన్' అవార్డు దక్కింది. ఢిల్లీలో శనివారం టూరిజం స్పెషల్ సెక్రటరీ జయేశ్‌రంజన్ చేతుల మీదుగా పర్యాటక శాఖ తరఫున ఎస్. ప్రభాకర్, డీటీవో జె.సాయిరామ్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ నెల 19, 20 తేదీల్లో హెచ్‌ఐసీసీ నోవోటెల్‌లో ట్రావెల్ అండ్ టూరిజం ఫెయిర్ (టీటీఎఫ్-2025) జరిగింది. ఇందులో తెలంగాణ పర్యాటక శాఖ బెస్ట్ డెకరేషన్ అవార్డును గెలుచుకున్నది. ఈ ఫెయిర్‌లో అత్యుత్తమ అలంకరణతో కూడిన స్టాల్‌ను ఏర్పాటు చేసినందుకు ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు లభించింది.