శ్రీజ ఇండియా నం.1

శ్రీజ ఇండియా నం.1

న్యూఢిల్లీ : తెలంగాణ టీటీ స్టార్‌‌‌‌ ప్లేయర్‌‌‌‌ ఆకుల శ్రీజ.. ఇండియా తరఫున ఐటీటీఎఫ్‌‌‌‌  ర్యాకింగ్స్‌‌‌‌లో టాప్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ను సాధించింది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌‌‌‌లో శ్రీజ 38వ ర్యాంక్‌‌‌‌లో నిలిచింది. ఆమె కెరీర్‌‌‌‌లో ఇదే అత్యుత్తమ ర్యాంక్‌‌‌‌ కావడం విశేషం. మనిక బాత్రా రెండు ప్లేస్‌‌‌‌లు దిగజారి 39వ ర్యాంక్‌‌‌‌లో నిలిచింది.

ఈ ఏడాది సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్న 25 ఏండ్ల శ్రీజ డబ్ల్యూటీటీ ఫీడర్‌‌‌‌ కార్పస్‌‌‌‌ క్రిస్టీ, డబ్ల్యూటీటీ బీరూట్‌‌‌‌ టైటిల్స్‌‌‌‌ను గెలిచింది. ఇక గోవాలో జరిగిన డబ్ల్యూటీటీ స్టార్‌‌‌‌ కంటెండర్‌‌‌‌లో క్వార్టర్స్‌‌‌‌ఫైనల్‌‌‌‌ చేరుకోవడం ర్యాంక్‌‌‌‌ మెరుగుపడటానికి దోహదపడింది. 

2022 కామన్వెల్త్‌‌‌‌ గేమ్‌‌‌‌లో శరత్‌‌‌‌ కమల్‌‌‌‌తో కలిపి శ్రీజ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ డబుల్స్‌‌‌‌ గోల్డ్‌‌‌‌ మెడల్‌‌‌‌ గెలిచిన సంగతి తెలిసిందే. యశస్విని గోర్పాడే, అర్చన కామత్‌‌‌‌ వరుసగా 99, 100వ ర్యాంక్‌‌‌‌ల్లో ఉన్నారు. మెన్స్‌‌‌‌లో శరత్‌‌‌‌ కమల్‌‌‌‌ 37వ ర్యాంక్‌‌‌‌లో  కొనసాగుతున్నాడు. సత్యన్‌‌‌‌, మానవ్‌‌‌‌ , హర్మీత్‌‌‌‌ దేశాయ్‌‌‌‌ వరుసగా 60, 61, 64వ ర్యాంక్‌‌‌‌ల్లో నిలిచారు.