కేశవ్ రావ్ జాదవ్, గద్దర్ నిజమైన తెలంగాణ హీరోలు

కేశవ్ రావ్ జాదవ్, గద్దర్ నిజమైన తెలంగాణ హీరోలు

నాంపల్లి శ్రీ పొట్టిశ్రీరాములు విశ్వవిద్యాలయంలో తెలంగాణ ఉద్యమం వైతాళికుల జయంతి సభ జరిగింది. ప్రొఫెసర్ కేశవ్ రావ్ జాదవ్, ప్రజాకవి గద్దర్ లో తెలంగాణకు నిజమైన హీరోలన్నారు వక్తలు. సిటీలో గద్దర్ విగ్రహం పెట్టడానికి పర్మిషన్ ఇవ్వకపోవడం దారుణమన్నారు.  గద్దర్, జాదవ్ లేకుంటే తెలంగాణ తొలి మలిదశ ఉద్యమాలు లేవన్నారు.

కేశవ్ రావ్ జాధవ్ అంటే తెలంగాణ మ్యాప్ అని.. మిస్టర్ తెలంగాణ అని  అన్నారు.  తెలంగాణ జాతిపిత అని ప్రస్తుతం చాలా మంది చాలా అనుకుంటున్నారూ..కానీ  అది  అనవసరమన్నారు.  నవ తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తి జాధవ్ అని చెప్పారు. పుడమి తల్లికి జన్మ అరణం ఇచ్చిన వ్యక్తులు జాధవ్ , గద్దర్ లు అని కొనియాడారు.  జన్మ అరణం ఇవ్వడం  అంటే సమాజం కోసం ప్రాణత్యాగం చేయడమేనన్నారు.

 కార్యక్రమంలో గద్దర్ కూతురు వెన్నెల, పాశం యాదగిరి, గాదె ఇన్నయ్య, విమలక్క, ప్రొఫెసర్ రియాజ్, సుద్దాల అశోక్ తేజ పాల్గొన్నారు. బెల్లి లలిత కొడుకు సూర్యప్రకాశ్ హాజరయ్యారు.