నవంబర్ 10లోగా యూనివర్సిటీల్లో కొలువుల నోటిఫికేషన్లు!

నవంబర్ 10లోగా యూనివర్సిటీల్లో కొలువుల నోటిఫికేషన్లు!
  • అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలపై ఉన్నతాధికారుల కీలక భేటీ
  • బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగ్, కొత్త పోస్టులకు వేర్వేరుగా ఒకేసారి నోటిఫికేషన్లు
  • డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రోస్టర్ రద్దు.. వర్సిటీ రోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోసం ఆర్డినెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ప్రతిపాదన

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి కసరత్తు ముమ్మరమైంది. వర్సిటీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల ఆమోదం, కొత్త రోస్టర్ ప్రక్రియను పూర్తి చేసి.. నవంబర్ 10లోగా నోటిఫికేషన్లు జారీ చేయాలని ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. సోమవారం సెక్రటేరియెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి నేతృత్వంలో 7 వర్సిటీల వీసీలతో సమావేశం జరిగింది.

ఈ సందర్భంగా వీసీలు కుమార్ మొలుగరం, చక్రపాణి, ప్రతాప్ రెడ్డి తదితరులు పలు సూచనలు చేశారు. అంతకుముందు ఉన్నత విద్యామండలి ఆఫీసులో వర్సిటీల రిజిస్ట్రార్లతో ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాల్లోనూ ప్రభుత్వ అనుమతి లభించిన 429 అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీ, పోస్టుల భర్తీపై సర్కారు ఇచ్చిన పలు జీవోలు, వాటి అమలు తీరుపై చర్చించారు.

వర్సిటీల్లో నియామకాలు చేపట్టే ముందుగా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగ్, అన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫిల్డ్ పోస్టుల వివరాలను సమర్పించాలని అధికారులు సూచించారు. బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగ్ ఖాళీలను భర్తీ చేయకుండా కొత్త పోస్టులను భర్తీ చేస్తే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు వచ్చే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు. దీంతో బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాగ్ పోస్టులతో పాటు కొత్త ఖాళీలను కూడా భర్తీ చేయాలని, అయితే ఈ రెండింటికీ వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేయాలని నిర్ణయించారు.

రోస్టర్ మార్పునకు ప్రభుత్వ ఆర్డినెన్స్..

ప్రస్తుతం వర్సిటీల్లో పోస్టుల భర్తీకి రోస్టర్ పాయింట్ల అంశమే ప్రధాన అడ్డంకిగా మారింది. గతంలో వర్సిటీల్లోని ఆయా డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్లను యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణించి రోస్టర్ కేటాయించి పోస్టులను భర్తీ చేసేవారు. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడంతో.. ఇకపై డిపార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కాకుండా మొత్తం యూనివర్సిటీనే ఒక యూనిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పరిగణించి రోస్టర్ అమలు చేయాల్సి ఉంటుంది.

దీనికోసం పాత విధానాన్ని రద్దు చేసి, నూతన యూనివర్సిటీ రోస్టర్ విధానానికి అనుమతినిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావాలని అధికారులు నిర్ణయించారు. ఏపీలోనూ ఇలాంటి రిక్రూట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కోసం ప్రత్యేక నిబంధనలు తెచ్చిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ మేరకు ప్రభుత్వం వెంటనే ఆర్డినెన్స్ జారీ చేసేలా టీజీసీహెచ్ఈ నుంచి ప్రభుత్వానికి లేఖ పంపనున్నారు.

మే, జూన్ నాటికి ప్రక్రియ పూర్తి..

నూతన రోస్టర్ విధానాన్ని కొలిక్కి తెచ్చిన వెంటనే, ఆయా వర్సిటీల ఎగ్జిక్యూటివ్ కౌన్సిళ్ల ఆమోదం తీసుకోవాల్సి ఉంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని వేగవంతం చేసి నవంబర్ 10వ తేదీలోగా నోటిఫికేషన్లు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని వీసీలు, రిజిస్ట్రార్లకు ఉన్నతాధికారులు సూచించారు. నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఎలాంటి జాప్యం లేకుండా దరఖాస్తులు, స్క్రీనింగ్ ప్రక్రియ ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

దరఖాస్తులను టీజీసీహెచ్ఈ స్వీకరించి, స్క్రీనింగ్ పూర్తి చేసేలా.. దీనికి అవసరమైన సహకారం వీసీల నుంచి తీసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఇంటర్వ్యూలు పూర్తి చేసి వచ్చే ఏడాది మే లేదా జూన్ చివరి నాటికి నియామక ప్రక్రియను ముగించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు.