నేడు (ఆగస్టు 20) తెలంగాణలో మోస్తరు వర్షాలు

నేడు (ఆగస్టు 20) తెలంగాణలో మోస్తరు వర్షాలు

హైదరాబాద్, వెలుగు: జార్ఖండ్‌, బెంగాల్‌ వరకు విస్తరించిన వాయుగుండం అల్పపీడనంగా బలహీనపడింది. దీని ప్రభావంతో గురువారం రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. 13 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.

ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హైదరాబాద్​  జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉం దని వాతావరణ శాఖ వెల్లడించింది.