
హైదరాబాద్, వెలుగు: ఖేలో ఇండియా యూత్ గేమ్స్‌లో తెలంగాణ స్విమ్మర్లు పతకాల మోత మోగించారు. ఒకే రోజు మూడు గోల్డ్ మెడల్స్‌తో సత్తా చాటారు. బీహార్ లోని గయాలో మంగళవారం జరిగిన మెన్స్ 400 మీటర్ల మిడ్లేలో డి. వర్షిత్ 4 నిమిషాల 38.39 సెకండ్ల టైమింగ్‌తో టాప్ ప్లేస్ సాధించాడు. ఏపీకి చెందిన మొంగమ్ తీర్ధు (4 ని. 38.87 సె) రజతం గెలిచాడు.
మహారాష్ట్ర స్విమ్మర్ రామ్‌దాస్ (4 ని. 44.74) కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. ఇక,100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో తెలంగాణ కుర్రాడు మైలారి సుహాస్ ప్రీతమ్ 58.73 సెకండ్లతో స్వర్ణం గెలిచాడు. హర్యానాకు చెందిన అర్జున్ సింగ్ (59.56 సె) రజతం, కర్నాటక స్విమ్మర్ సమర్థ్ గౌడా (59.74 సె) కాంస్యం అందుకున్నారు. విమెన్స్ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీ నిత్యసాగి 1 నిమిషం 06.36 సెకండ్లతో బంగారు పతకం గెలిచింది.