కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వలేం

కేఆర్ఎంబీకి ప్రాజెక్టులు ఇవ్వలేం
  • సుప్రీంకోర్టులో తెలంగాణ వాదన

హైదరాబాద్, వెలుగు : కృష్ణా బేసిన్​లోని ప్రాజెక్టుల్లో పూర్తిస్థాయి జల విద్యుదుత్పత్తి జరపాలని గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 34పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వే సింది. ఆగస్టు 20న దీనిపై విచారణ చేపడతా మని మంగళవారం స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 34ను సవాల్ చేస్తూ ఏపీ సర్కార్ ఇదివరకే సుప్రీంకోర్టుకు వెళ్లింది. ఆ పిటిషన్​పై మంగళవారం రెండు వర్గాల వాదనలను సుప్రీంకోర్టు విన్నది. కృష్ణా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించేందుకు నిర్ణయించామని ఏపీ ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకొచ్చింది.

తెలంగాణ ప్రభుత్వం కూడా గతంలో అందుకు సిద్ధమైందని, ఇలాంటి స్థితి లో ఆయా ప్రాజెక్టుల్లో విద్యుదుత్పత్తి చేపట్టడం సరికాదని వాదించింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రాలకు నీటి కేటాయింపుల అంశంపై ట్రిబ్యున ల్ విచారణ జరుపుతున్నదని, అందువల్ల ప్రాజెక్టులను కృష్ణా బోర్డుకు అప్పగించలేమని తెలంగాణ తరఫున అడ్వకేట్​ వాదించారు. 2 రాష్ట్రాల వాదనలు విన్న తర్వాత విచారణను వచ్చే నెలకు సుప్రీంకోర్టు వాయిదా వేసింది.