
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ టెన్నిస్ ప్లేయర్ భవాని కేడియా.. జపాన్‌లోని టోక్యోలో జరగనున్న డెఫ్‌లింపిక్స్ (బధిరుల ఒలింపిక్స్)కు ఎంపికైంది. నవంబర్ 15 నుంచి 26 వరకు ఈ గేమ్స్ జరగనున్నాయి. తెలంగాణ నుంచి ఈ టోర్నీకి అర్హత సాధించిన తొలి ప్లేయర్‌గా భవాని గుర్తింపు పొందింది. 2022 బ్రెజిల్‌లో జరిగిన డెఫ్‌లింపిక్స్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన భవాని సత్తా చాటింది.
వినికిడి లోపంతో బాధపడుతున్న ఆమెకు టెన్నిస్ అంటే ఇష్టం. అంటాల్యా (2018), టర్కీ (2019) జరిగిన వరల్డ్ డెఫ్ టెన్నిస్‌లో ఇండియాకు ప్రాతినిధ్యం వహించిన భవాని.. 2019 చెన్నైలో జరిగిన నేషనల్ డెఫ్ గేమ్స్ సింగిల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో రెండు సిల్వర్ మెడల్స్‌ను గెలుచుకుంది. ప్రస్తుతం భవాని శిక్షణ తీసుకుంటోంది. డేవిస్ కప్ మాజీ ప్లేయర్ ఎం. వాసుదేవ రెడ్డి వద్ద శిక్షణ
తీసుకుంటోంది.