
భారతదేశ టెలికాం కంపెనీల ఆపరేటింగ్ లాభం ఈ ఆర్థిక సంవత్సరంలో 12-–14 శాతం పెరిగి సుమారు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకుంటుందని క్రిసిల్ రేటింగ్స్ సోమవారం తెలిపింది. డేటా వినియోగంతోపాటు ప్రతి వినియోగదారుడి నుంచి సగటు ఆదాయం (ఏఆర్పీయూ) పెరగడమే ఇందుకు కారణమని వెల్లడించింది.
దీని రిపోర్ట్ప్రకారం.. ఆపరేటింగ్ పనితీరు బలంగా వల్ల టెల్కోల మూలధన వ్యయం తగ్గడంతోపాటు, ఫ్రీ క్యాష్ ఫ్లో మెరుగుపడుతుంది. అధిక ఆపరేటింగ్ లీవరేజ్‌తో ప్రయోజనం దక్కుతుంది. ఈసారి ఏఆర్‌పీయూలో ఒక్క రూపాయి పెరుగుదల కూడా పరిశ్రమ ఆపరేటింగ్ లాభాన్ని రూ. 8,50,-950 కోట్లు పెంచుతుంది. వడ్డీ, పన్నులు, తరుగుదల, అప్పుల చెల్లింపు, లీజు, అద్దె చెల్లింపులకు ముందు ఆదాయాన్ని ఆపరేటింగ్ ప్రాఫిట్ అంటారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది 12–-14 శాతం పెరిగి సుమారు రూ. 1.55 లక్షల కోట్లకు చేరుకుంటుంది.
మనదేశంలో టాప్–3 టెల్కోల దగ్గరే దాదాపు 93 శాతం మంది యూజర్లు ఉన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో వీటి ఆపరేటింగ్ లాభం సుమారు 17 శాతం పెరిగింది. దీనికి ప్రధాన కారణం టారిఫ్ పెంపు. ఏఆర్పీయూ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 205 ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 220-–225కి పెరుగుతుందని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ ఆనంద్ కులకర్ణి తెలిపారు. 5జీ నెట్‌వర్క్ మార్చి 2025 నాటికి 35 శాతం నుంచి మార్చి 2026 నాటికి 45–-47 శాతానికి చేరుకుంటుందని అంచనా.
భారీగా డేటా వినియోగం...
సోషల్ మీడియా, వీడియో స్ట్రీమింగ్, గేమింగ్, జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ మార్కెటింగ్ వంటి అప్లికేషన్‌ల కోసం సబ్స్క్రయిబర్లు విపరీతంగా డేటా వాడుతున్నారు. దీని వాడకం గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 27 జీబీ నుంచి 2026లో 31–-32 జీబీకి పెరుగుతుందని అంచనా. టెల్కోలు తక్కువ డేటా పరిమితి కలిగిన ప్లాన్‌లను తగ్గించడం లేదా అధిక డేటా పరిమితి కలిగిన ప్లాన్‌లలో మాత్రమే 5జీ సేవలను అందిస్తున్నాయి.
దీంతో యూజర్లు ప్రీమియం ప్లాన్లకు మారుతున్నారు. ఫలితంగా ఏఆర్పీయూ పెరుగుతోంది. డేటా -ఆధారిత సేవల కోసం పెరుగుతున్న డిమాండ్‌తో, టెలికాం సంస్థలు ఓటీటీ సేవలను అందించే ప్రీమియం ప్లాన్‌లను తెచ్చాయి. ఇవి కూడా ఏఆర్పీయూను పెంచాయని క్రిసిల్ రేటింగ్స్ రిపోర్ట్తెలిపింది.
కాల్స్, మెసేజ్‌లు పోలేఎయిర్‌టెల్, జియో, వీ నెట్‌వర్క్‌లో ఇబ్బందులు
మొబైల్ నెట్‌వర్క్ యూజర్లు సోమవారం ఇబ్బందులు పడ్డారు. దేశంలోని చాలా చోట్ల ఎయిర్‌టెల్, జియో, వొడాఫోన్ ఐడియా (వీ) సరిగ్గా పనిచేయలేదు. కాల్స్, మెసేజ్‌లు పంపడం కష్టమైంది. ఎయిర్‌టెల్ వినియోగదారులు ఎక్కువగా ప్రభావితమయ్యారు. ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో మొదలైన ఈ సమస్య ముంబై, బెంగళూరు సహా దేశవ్యాప్తంగా విస్తరించింది.
“ఢిల్లీ ఎన్‌సీఆర్ వినియోగదారులకు వాయిస్ కాల్స్‌లో సమస్యలు వస్తున్నాయి. వాటిలో చాలా భాగం పరిష్కరించాం. మిగిలిన సమస్యలపై ఇంజినీర్లు పని చేస్తున్నారు” అని ఎయిర్‌టెల్ పేర్కొంది. ఎనాలసిస్ కంపెనీ డౌన్‌డిటెక్టర్ ప్రకారం, ఎయిర్‌టెల్ అవాంతరాలపై 3,600కి పైగా ఫిర్యాదులు వచ్చాయి. జియో, వీ వినియోగదారుల నుంచి కూడా సాధారణం కంటే ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయి. ఛండీగడ్, అహ్మదాబాద్, గువాహటి, మదురై సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. వినియోగదారులు ఎక్స్‌లో #ఎయిర్‌టెల్‌డౌన్ ట్రెండ్ చేస్తూ, కాల్స్, మెసేజులు పనిచేయడం లేదని, తీవ్ర అసౌకర్యం కలుగుతోందని తెలిపారు. సమస్యలను పరిష్కరిస్తున్నామని ఎయిర్‌టెల్ పేర్కొంది.