Telecom Sector : కస్టమర్లను కోల్పోతున్న టెలికాం రంగం

Telecom Sector : కస్టమర్లను కోల్పోతున్న టెలికాం రంగం

టెలికాం పరిశ్రమ 2022 నవంబర్ లో 45 లక్షల మంది కస్టమర్లను కోల్పోయింది. చాలా మంది డ్యూయల్ సిమ్ లకు బదులు ఒకే సిమ్ వాడటం, ఫీచర్ ఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ కు మారడమే ఇందుకు కారణం. చాలామంది కస్టమర్లు కొత్తగా వచ్చిన 5జీ నెట్ వర్క్ కు అప్ డేట్ అవుతుండటం కూడా మరో కారణంగా తెలుస్తోంది. అయితే టెలికాం రంగంలో ఇంత భారీ సంఖ్యలో కస్టమర్లు తగ్గడం గత 7 నెలల్లో ఇదే మొదటిసారి. 

మొబైల్ టారిఫ్ పెరుగుతుండటంతో సిమ్ ల సంఖ్య తగ్గుతోందని, మరికొన్ని క్వార్టర్ల వరకు ఇదే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. మార్కెట్ లీడర్ రిలయన్స్ జియో అత్యధిక సంఖ్యలో 30 లక్షల మందిని, వొడాఫోన్ 15 లక్షల మంది కస్టమర్లను కోల్పోయిందని జేఎం ఫైనాన్షియల్ వెల్లడించింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనూ ఎయిర్ టెల్ మాత్రం 10 లక్షల మంది కొత్త యూజర్లను సంపాదించుకుంది. జియో యాక్టివ్ సబ్ స్క్రిప్షన్లు తగ్గడానికి సిమ్ కన్సాలిడేషన్ ప్రధాన కారణమని నిపుణులు అంటున్నారు.