ప్రాజెక్ట్ ల కోసం నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాం..

ప్రాజెక్ట్ ల కోసం నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపాం..

తెలంగాణ వచ్చి10 సంవత్సరాలు అయింది.   దశాబ్ధి ఉత్సవాల్లో  భాగంగా ఈ రోజు ( జూన్ 7)  ఇరిగేషన్ శాఖ సంబరాలు చేసుకుంటున్నామన్నారు మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం తెలంగాణ లో పండిన బియ్యం మనకే కాకుండా 10 రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నామంటూ..ఇప్పుడు  ధాన్యగార తెలంగాణ మారిందన్నారు. సాగునీటి ప్రాజెక్ట్ ల కోసం   ఎన్నో రాత్రులు  నిద్ర లేని రాత్రులు గడిపామన్నారు. ఉద్యమ నాయకుడే సీఎం కాబట్టి ప్రతి పనిని ఉద్యమంగా సీఎం కేసీఆర్ చేస్తున్నారన్నారు.  

దేశంలో ఎక్కడా లేని రిజర్వాయర్ మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను నిర్మించామన్నారు.  దేశంలో ప్రాజెక్ట్ ల కోసం  తిరగని ఆఫీసు లేదన్నారు మంత్రి హరీష్ రావు. గతంలో  పనుల కోసం ఇతర రాష్ట్రాలకు వెళ్లిన కూలీలు.. ఇప్పుడు ఇతర రాష్ట్రాల కూలీలు  తెలంగాణకు పనుల కోసం వస్తున్నారని తెలిపారు. రాబోయే  రోజుల్లో రంగనాయక సాగర్ పర్యాటక ప్రాంతంగా, డెస్టినేషన్ ప్రాంతంగా మారుతుందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఏసీ పెట్టుకునే స్థాయి కి ఈ ప్రాంతం ఎదిగిందన్నారు.  గతంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఏ కాలేజీ లేదని ఇప్పుడు అన్నీ రకాల కాలేజీలను ఏర్పాటు చేశామన్నారు.