
ఇటీవల వెలుగులోకి వచ్చిన యూజీసీ నెట్ పరీక్ష పేపర్ లీక్ పై టెలిగ్రామ్ సంస్థ స్పందించింది. పేపర్ లీక్ లో పాలుపంచుకున్న చానళ్లను బ్లాక్ చేసినట్లు తెలిపింది. చట్టానికి లోబడి అధికారులు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ కు పూర్తిగా సహకరిస్తామని తెలిపింది. ప్రశ్నపత్రాలను సంబంధించి అనధికారిక కాపీలను సర్కులేట్ చేసిన చానళ్లను ఇప్పటికే బ్లాక్ చేశామని తెలిపింది.పబ్లిక్ కంటెంట్ యొక్క చట్టబద్ధత గురించి మా హెల్ప్‌డెస్క్‌లలో ఏదైనా ఫిర్యాదు వచ్చినప్పుడు, అవసరమైన చట్టపరమైన తనిఖీలను నిర్వహిస్తామని, IT యాక్ట్ 2000లో ఉన్న మార్గదర్శకాలకు అనుగుణంగా లేకపోతే దానిని తీసివేస్తామని తెలిపింది.
పేపర్ లీక్ నేపథ్యంలో పరీక్షను రద్దు చేసిన యూజీసీ తిరిగి పరీక్ష నిర్వహించబోయే తేదీని త్వరలోనే ప్రకటిస్తామని తెలిపింది. ఈ అంశంపై డార్క్ నెట్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సహాయంతో సిబిఐ దర్యాప్తు జరుగనున్నట్లు సమాచారం అందుతోంది. విద్యాశాఖ నుండి చాలా లింకుల ద్వారా పేపర్ లీకేజి జరిగినట్లు తెలిపింది. పరీక్షకు చాలా రోజుల ముందు జరిగిన ఈ లీకేజికి సంబంధించి కొన్ని టెలిగ్రామ్ ఛానల్స్ లో పేమెంట్స్ కి సంబంధించిన స్క్రీన్ షాట్స్ కూడా గుర్తించినట్లు తెలుస్తోంది.