టెలిగ్రామ్ లో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్

టెలిగ్రామ్ లో వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్

టెలిగ్రామ్... వినియోగదారుల అవసరాలకు తగ్గట్టు కొత్త అప్ డేట్స్ ఇవ్వడంలో ఎప్పుడు ముందే ఉంటుంది. ఇప్పుడు కూడా ప్రీమియం తీసుకున్నవాళ్లతో పాటు, స్టాండర్డ్ యూజర్ల కోసం కొత్త అప్ డేట్స్ తీసుకొచ్చింది. కలెక్టబుల్ యూజర్ నేమ్స్, న్యూ ఇమోజీ ప్యాక్స్, రి డిజైన్డ్ నైట్ మోడ్, రీ సైజింగ్ టెక్స్ట్, న్యూ ఇంటెరాక్టింగ్ ఇమోజీ రియాక్షన్ తో పాటు, ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వాయిస్ టు టెక్స్ట్ ఫీచర్ ని కూడా తీసుకొచ్చింది. ఈ ఫీచర్లు ఎలా పనిచేస్తాయంటే..
* ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, స్నాప్ చాట్ లాంటి సోషల్ మీడియాల ప్లాట్ ఫామ్ లో ఉండే యూజర్ నేమ్స్ ని టెలిగ్రామ్ బయోలో పోట్టుకోవచ్చు. వాటిపై క్లిక్ చేస్తే ఆయా సోషల్ మీడియా సైట్లకి తీసుకెళ్తుంది.
* ఎవరైనా వాయిస్ మెసేజ్ పంపిస్తే నలుగురిలో వినడానికి ఇబ్బంది పడుతుంటారు చాలామంది. వాళ్లకు వాయిస్ టు టెక్స్ట్ మెసేజ్ ఉపయోగపడుతుంది. ఈ ఫీచర్ వాయిస్ మెసేజ్ ని టెక్స్ట్ రూపంలో కన్వర్ట్ చేస్తుంది. 
* 12 రకాల కస్టమైజ్డ్ ఇమోజీ, స్టిక్కర్ ప్యాక్ లను తీసుకొచ్చింది.  
* ఐఓఎస్ వినియోగదారుల కోసం డార్క్ థీమ్‌లు అప్‌డేట్ వచ్చింది. దీనివల్ల చాట్‌, చాట్ లిస్ట్‌లో స్క్రోల్ చేస్తున్నప్పుడు బ్లర్రింగ్ ఎఫెక్ట్‌లలో రంగులు మరింత బ్యాలెన్స్‌గా కనిపిస్తాయి.
* టెక్ట్ సైజ్ ని కస్టమైజ్ చేయొచ్చు. అంటే కావాల్సిన సైజ్ లో టెక్స్ట్ ని హోమ్ స్క్రీన్ మీదే పెంచుకోవచ్చు. తగ్గించుకోవచ్చు.
* ఇమోజీ చాటింగ్ కొత్తగా ఉండనుంది. ఏదైనా ఇమోజీని సెండ్ చేస్తే దానికి సంబంధించిన రియాక్షన్ ఇమోజీలన్నీ స్క్రీన్ పై ప్లే అవుతాయి.