రెహ్మాన్ ఎవరు? భారత రత్న కాలి గోటితో సమానం

V6 Velugu Posted on Jul 22, 2021

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో, నటరత్న నందమూరి బాలకృష్ణ వివాదంలో చిక్కుకున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహ్మాన్ గురించి ఓ ఇంటర్వ్యూలో బాలయ్య చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగుతోంది. సోషల్ మీడియాలో బాలయ్యపై సినీ ప్రేక్షకులు పెద్ద ఎత్తున కామెంట్లు చేస్తున్నారు. రెహ్మాన్ ఎవరో తనకు తెలియదని బాలయ్య చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. అలాగే తన తండ్రి, ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ సీఎం ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వకపోవడం మీద బాలయ్య ఘాటు వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

ఇంతకీ ఆ ఇంటర్వ్యూలో బాలయ్య ఏమన్నారంటే.. 'నాకు ఏఆర్ రెహ్మాన్ ఎవరో తెలియదు. రెహ్మాన్ ఆస్కార్ అవార్డు గెలిచి ఉండొచ్చు.. కానీ ఆయనెవరో నాకైతే తెలియదు. ఆయన పదేళ్లకు ఒక హిట్ ఇస్తారు' అని ఓ తెలుగు ఛానల్ తో ఇంటర్వ్యూలో బాలయ్య వ్యాఖ్యానించారు. గమ్మత్తైన విషయం ఏమిటంటే.. 1993లో బాలయ్య నటించిన నిప్పురవ్వ మూవీకి రెహ్మాన్ బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించడం గమనార్హం. దీన్ని పక్కనపెడితే.. తన తండ్రి, స్వర్గీయ ఎన్టీఆర్ కు భారత రత్న పురస్కారం ఇవ్వకపోవడం పై బాలయ్య ఘాటుగా స్పందించారు. భారత రత్న ఎన్టీఆర్ కాలి గోటితో సమానమని చెప్పిన బాలయ్య.. టాలీవుడ్ కు తన ఫ్యామిలీ అందించిన సేవలను ఏ అవార్డయినా సరిపోదన్నారు. కాబట్టి అవార్డులు రాలేదని తమ కుటుంబం బాధపడదని.. తమకుఇవ్వనందుకు ఆ పురస్కారాలే ఫీల్ అవుతాయన్నారు. దీంతో బాలయ్యపై రెహ్మాన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. సీనియర్ నటుడు అయి ఉండి ఇలా మాట్లాడటమేంటని ఫైర్ అవుతున్నారు. 

Tagged Actor Balakrishna, awards, NTR, tollywood, Bharata Ratna, ar rahman, Nippuravva

Latest Videos

Subscribe Now

More News