ఇండియన్ 2లో విలన్‌గా వెన్నెల కిశోర్

ఇండియన్ 2లో విలన్‌గా వెన్నెల కిశోర్

రీసెంట్ డేస్ లో తన కామెడీతో కడుపబ్బా నవ్వించే కమెడియన్లలో ఒకరు వెన్నెల కిశోర్. ఇప్పటివరకూ హాస్యం మాత్రమే పండించిన ఈ నటుడు.. ఇప్పుడు నెగెటివ్ రోల్ లో కనిపించనున్నాడు. అదే ఇండియన్ 2. దేశం గర్వించదగిన డైరెక్టర్లలో ఒకడైన శంకర్ 26 ఏళ్ల కిందట తీసిన ఇండియన్ (భారతీయుడు) మూవీకి ఇద్ సీక్వెల్. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో మొత్తం ఏడుగురు విలన్లు ఉండనున్నట్టు సమాచారం. ఆ ఏడుగురిలో వెన్నెల కిశోర్ కూడా ఓ విలన్ అనే వార్తలు  వినిపిస్తున్నాయి. ఇప్పటివరకూ ఎన్నో చిత్రాల్లో నటించి.. తన నటనతో, కామెడీతో పాపులారిటీ తెచ్చుకున్న వెన్నెల కిశోర్.. ఇప్పుడు విలన్ రోల్ లో చేస్తుండడంతో ఆయన ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుమునుపు హీరో అడివి శేష్ నటించిన గూఢాచారిలోనీ కిశోర్ ప్రతినాయకుడి పాత్రను పోషించగా.. ఇప్పుడు ఇండియన్ 2 ద్వారా మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. ఇదిలా ఉండగా  వెన్నెల చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీలోకి పరిచయమైన కిశోర్ కు ఆ సినిమా పేరే అతని ఇంటి పేరుగా మారింది.