
టాలీవుడ్‌లో సినీ వర్కర్స్ వేతనాల పెంపుపై పెద్దఎత్తున నిరసనలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎలాంటి షూటింగ్లు జరపకూడదని సంచలన ప్రకటన చేసింది.
లేటెస్ట్గా తెలుగు సినిమా పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్ ఫెడరేషన్‌లోని నేతలు ఏకపక్ష సమ్మెకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలో సినిమా షూటింగ్ లకి అనుమతి ఇవ్వొద్దని ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆదేశాలు జారీ చేసింది. సమ్మె కార్మికులతో చర్చలు లేదా సంప్రదింపులు చేయకుండా ఫిల్మ్ చాంబర్ సభ్యులు ఉండాలని సూచనలు చేసింది.
ALSO READ : సుధీర్ బాబు 'జటాధర' టీజర్ రిలీజ్..
అలాగే, అది ఎంత పెద్ద సినిమా ఐనా.. తమ అనుమతి లేకుండా షూటింగ్లు జరపకూడదని కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఔట్ డోర్, స్టూడియో వంటి అన్నీరకాలైన షూటింగ్స్ తక్షణమే నిలిపివేయాలని ఫిల్మ్ చాంబర్ కీలక ఆదేశాలు జారీ చేసింది.
ఈ నిబంధన ఫిల్మ్ చాంబర్ నుండి తదుపరి సూచనలు వచ్చే వరకు అమలులో ఉంటాయని తెలిపింది. ఇందుకు సినీ నిర్మాతలు మరియు స్టూడియో విభాగ సభ్యులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని నియమాలు పాటించగలరని ప్రకటనలో వెల్లడించింది.