Jatadhara: సుధీర్ బాబు 'జటాధర' టీజర్ రిలీజ్.. సోనాక్షి సిన్హా ఎంట్రీ లుక్ అదుర్స్!

Jatadhara:  సుధీర్ బాబు 'జటాధర' టీజర్ రిలీజ్.. సోనాక్షి సిన్హా ఎంట్రీ లుక్ అదుర్స్!

టాలీవుడ్ నటుడు సధీర్ బాబు ( Sudheer Babu  ), బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా ( Sonakshi Sinha ) నటించిన పౌరాణిక, అతీంద్రియ కథా చిత్రం ' జటాధర ' ( Jatadhara ).  ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను మూవీ మేకర్స్ అందించారు.  ఎప్పటి నుంచో అభిమానులు ఎదురుచూస్తున్న ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాతో సోనాక్షి టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.  ఒక శక్తివంతమైన, విలక్షణమైన పాత్రలో ఆమె కనించబోతోంది.

 అత్యాశకు , త్యాగానికి మధ్య  జరిగే సంఘర్షణే  ప్రధాన ఇతివృత్తంగా ఈ "జటాధర"  చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ టీజర్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. అద్భుతమైన విజువల్స్ తో ఆకట్టుకుంటుంది.  సోనాక్షి సిన్హా పాత్రను పరిచయం చేసే సన్నివేశం అత్యంత ఆసక్తికరంగా ఉంది . ఒక గుహ లోపల ఉన్న ఒక గదిలోకి వెళ్తున్నట్లు చూపించిన విజువల్స్ ప్రేక్షకులను థ్రిల్ చేస్తాయి.  ఈ చిత్రంలో ఆమె పాత్ర శక్తివంతంగా, అదే సమయంలో భయంకరంగా కనిపిస్తుంది.

ALSO READ : 'SSMB29' అప్‌డేట్ వస్తుందా?

సుధీర్ బాబు పరిచయం మరింత ఆసక్తికరంగా ఉంది. వేద మంత్రాలు, శక్తివంతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఆయన పాత్రను ఈ టీజర్ లో చూపించారు. సుధీర్ బాబు త్యాగం, ధర్మం నుంచి పుట్టిన ఒక శక్తిగా కనిపిస్తాడు. అత్యాశకు ప్రతీక అయిన సోనాక్షి పాత్రతో పోరాడే ఏకైక శక్తిగా ఆయన ఉంటాడని తెలుస్తోంది.

ఈ సినిమా టీజర్ లో చూపించిన విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను విస్మయానికి గురిచేస్తున్నాయి. అద్భుతమైన విజువల్స్, టీజర్‌లో కనిపించే హై-ఎండ్ VFX చూస్తే, ఈ సినిమా భారతీయ సినిమాలో కొత్త ప్రమాణాలను సృష్టిస్తుందని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  తెలుగుతో పాటు ఇతర భాషలలో కూడా ఈ చిత్రం విడుదల కానుంది.  జీ స్టూడియోస్, ప్రేరణా వి అరోరా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  వెంకట్ కళ్యాణ్ ,  అభిషేక్ జైస్వాల్ లు దర్శకత్వం వహించారు. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉంది. తెలుగు ప్రేక్షకుల అంచనాలను ఈ సినిమా ఏ మేరకు చేరుకుంటుందో వేచి చూడాలి.