Mahesh Babu : 'SSMB29' అప్‌డేట్ వస్తుందా?... ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ !

Mahesh Babu :  'SSMB29' అప్‌డేట్ వస్తుందా?...  ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ !

దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబోలో వస్తున్న మూవీ 'SSMB29. బారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించిన  ఒక్క అప్టేట్ కూడా మూవీ మేకర్స్ నుంచి అఫీషియల్ గా ఇప్పటివరకు రాలేదు. ఆగస్టు 9న  మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగానైనా 'SSMB29'  మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ వంటి అప్టేట్ వస్తుందా? రాదా.. అని  అభిమానులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు.

హైదరాబాద్ లోని  అల్యూమినియం ఫ్యాక్టరీలో ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తైన తర్వాత చిత్ర బృందం అంతా ఒరిస్సా వెళ్లారు. అయితే అక్కడ షూటింగ్ చేసినప్పుడు కొన్ని విజువల్స్ లీక్ అయ్యాయి. వీటిపై రాజమౌళి మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత పలు సినిమా వేడుకలను ఆయన హాజరైనా సరే ఈ మూవీ అప్డెట్ గురించి అడిగినా మౌనంగా దాటవేశారు. మరి ఇప్పుడు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగానైనా వీరి సినిమాకు సంబంధించిన అప్డేట్ ఇస్తారా.. లేదా అని అభిమనులు ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు
 
సహజంగా తన తండ్రి , దివంగత సూపర్ స్టార్ కృష్ణ ప్రతి పుట్టినరోజుకు తన కొత్త సినిమా అప్టేట్ ఇవ్వడం మహేష్ బాబుకు అలవాటు. కానీ ఈ ఏడాది మే 31న కృష్ణ బర్త్ డే సందర్భంగా ఎలాంటి అప్టేట్ ఇవ్వలేదు. మరి తన బర్త్ డే కైనా అప్టేట్ ఇస్తారేమో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరో వైపు మహేష్ బాబు బర్త్ డే ను పురష్కరించుకొని 'అతడు' ( Athadu ) సినిమాను ఆగస్టు 9న రీరీలిజ్ చేస్తున్నారు మూవీ మేకర్స్. అంతే కాదు పలు చోట్ల స్పెషల్ ప్రీమియర్ షోలు కూడా ఒక రోజు ముందుగానే వేస్తున్నారు. ఇప్పటికే థియేటర్స్ వద్ద ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు.

SSMB29 మూవీ గురించి ఇప్పటి నుంచి అప్డేట్స్ ఇస్తూ వెళితే సినిమా విడుదల సమయానికి సర్‌ప్రైజ్‌లు ఏమీ ఉండవని దర్శకుడు రాజమౌళి భావిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో మహేష్ బాబు సరసన ప్రియాంకా చోప్రా నటిస్తోంది. మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, తమిళ నటుడు ఆర్ మాధవన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ పతాకం మీద కేఎల్ నారాయణ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు..