
రష్మిక మందన్నా(RashmikaMandanna) టార్గెట్గా చిత్రీకరించిన డీప్‌ఫేక్ వీడియో అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటుగా జర్నలిస్టులు సైతం ఆమెకు మద్దతుగా నిలిచారు.ఈ చర్యను ఖండిస్తూ నిన్న తెలుగు ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ (TFJA) పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై రష్మిక తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా స్పందించింది.
ఇలాంటి పరిస్థితుల్లో తనకు సపోర్ట్ అందించినందుకు తెలుగు సినిమా జర్నలిస్ట్ అసోసియేషన్ వారికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు అంటూ కొన్ని ఫొటోలను షేర్ చేసింది.
జారా పటేల్ అనే అమ్మాయి ముఖానికి రష్మిక ఫేస్ మార్ఫింగ్ చేసి డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీతో మార్చేసిన ఈ వీడియో కొద్ది సమయంలోనే సంచలనంగా మారిన విషయం తెలిసిందే. దీనిపై సెలబ్రిటీలు సైతం తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి వాటితో మహిళల భద్రతను ముప్పు ఉందని దీనిని వెంటనే కట్టడి చేయాలని గొంతెత్తారు.
ఇదే విషయంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ఇండియాలో ఐటీ నిబంధనలు ఉల్లంగించే ఏ కంటెంట్ అయినా తీసేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కు గుర్తుచేశారు. లేదంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
This means a lot to me @FilmJournalists .. thankyou so much for your support ? https://t.co/Qs8kutwDya
— Rashmika Mandanna (@iamRashmika) November 8, 2023