రాబోయే రోజుల్లో నాటక ఉత్సవాలు నిర్వహిస్తాం : వి. నిత్యానందరావు

 రాబోయే రోజుల్లో నాటక ఉత్సవాలు నిర్వహిస్తాం :  వి. నిత్యానందరావు
  • తెలుగు విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షుడు ఆచార్య వి. నిత్యానందరావు
  • ఢిల్లీలో ఘనంగా ముగిసిన ‘రసఝరి’ నృత్యోత్సవాలు

న్యూఢిల్లీ, వెలుగు: తెలుగు లలితకళలను దేశమంతా వ్యాప్తి చేసేందుకు కృషి చేస్తున్నట్టు సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం (ఎస్​పీఆర్టీయూ) ఉపాధ్యక్షుడు ఆచార్య వి. నిత్యానందరావు  తెలిపారు. ఇందులో భాగంగా రాబోయే రోజుల్లో నాటక, సంగీత, జానపద ఉత్సవాలను నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ఎస్​పీఆర్టీయూ ఆధ్వర్యంలో దేశ రాజధాని ఢిల్లీలో ‘రసఝరి’ పేరిట నిర్వహించిన రెండ్రోజుల నృత్యోత్సవాలు ఆదివారం ముగిశాయి. తెలుగు సాంప్రదాయ నృత్యాలతో పాటు భారతీయ శాస్త్రీయ నృత్యాల పరిరక్షణ కోసం తెలుగు వర్సిటీ ఈ వేడుకల్ని 3, 4 తేదీల్లో ఘనంగా నిర్వహించింది.

రెండో రోజు కార్యక్రమాల్లో భాగంగా భారతీయ నృత్యాలపై జాతీయ సదస్సును నిర్వహించారు. ఈ వేడుకల్లో తెలుగు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య కె. హనుమంతరావు, ఆంధ్ర అసోసియేషన్ ఢిల్లీ మేనేజింగ్ ట్రస్టీ మణి నాయుడు, అధ్యక్షుడు కె. సత్యనారాయణ, కార్యదర్శి మాచిరాజు లహరి, సంస్థ కార్యవర్గ సభ్యుడు, తెలుగు వర్సిటీ డీన్ ఆచార్య బి. రాధా సారంగపాణి  పాల్గొన్నారు.