యూనిక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసేలా.. తెలుసు కదా..

యూనిక్‌‌‌‌ పాయింట్‌‌‌‌తో  సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ చేసేలా.. తెలుసు కదా..

‘‘కేజిఎఫ్, హిట్ 3 లాంటి రెండు యాక్షన్‌‌‌‌,  బ్లడ్‌‌‌‌ బాత్‌‌‌‌ సినిమాల తర్వాత ‘తెలుసు కదా’ లాంటి ఓ లైట్ హార్టెడ్‌‌‌‌ సినిమాలో నటించడం కొత్తగా ఉంది’’ అని చెప్పింది శ్రీనిధి శెట్టి. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన ఈ చిత్రంలో రాశీఖన్నాతో కలిసి ఆమె నటించింది. స్టైలిష్ట్‌‌‌‌ నీరజ కోన దర్శకత్వంలో టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. అక్టోబర్ 17న సినిమా విడుదలవుతున్న సందర్భంగా శ్రీనిధి శెట్టి ఇలా ముచ్చటించింది.  

ఇదొక ఫీల్ గుడ్‌‌‌‌ రొమాంటిక్ ఎంటర్‌‌‌‌‌‌‌‌టైనర్. ‘హిట్ 3’కి ముందే ఈ కథ విన్నాను. ఇద్దరు అమ్మాయిలు, ఓ అబ్బాయి అనగానే ఎవరైనా ఇది ట్రయాంగిల్ లవ్‌‌‌‌ స్టోరీ అనుకుంటారు. కానీ ఇందులో ఓ యూనిక్‌‌‌‌ పాయింట్‌‌‌‌ను టచ్ చేశాం. అదేమిటో థియేటర్‌‌‌‌‌‌‌‌లో చూసి సర్‌‌‌‌‌‌‌‌ప్రైజ్ అవుతారు.  లవ్, ఎమోషన్,  ఎంటర్‌‌‌‌‌‌‌‌టైన్మెంట్‌‌‌‌, పాటలు లాంటి అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌‌‌‌ ఉన్న రొమాంటిక్ డ్రామా. 

స్వతహాగా నాకు ఇలాంటి రొమాంటిక్ స్టోరీస్ చాలా ఇష్టం. కొవిడ్‌‌‌‌ టైమ్‌‌‌‌లో  కొరియన్‌‌‌‌ రొమాంటిక్‌‌‌‌ సిరీస్‌‌‌‌లు ఎక్కువ చూశాను. ఇక ఇందులోని సిద్ధు గారి క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌ను థియేటర్‌‌‌‌‌‌‌‌లో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. పోషించిన రాగ పాత్రలో కొంత గ్రే షేడ్ ఉంది. నిజ జీవితంలో నేనలా ఉండలేను. అది మినహా పర్సనల్‌‌‌‌గా నాకు, ఈ పాత్రకు కొన్ని సిమిలారిటీస్‌‌‌‌ ఉన్నాయి. 

సిద్ధు గారికి అన్ని డిపార్ట్‌ మెంట్స్‌ పై  నాలెడ్జ్‌‌‌‌ ఉంది. ఒక నటుడికి అది గొప్ప అదృష్టం. అలాగే తన టైమింగ్‌‌‌‌ అద్భుతం.   ఇక రాశీ ఖన్నా చాలా క్రమశిక్షణ గల నటి. డైట్, వర్కవుట్ విషయంలో చాలా స్ట్రిక్ట్‌‌‌‌గా ఉంటుంది. ఇక నీరజ చాలా సాఫ్ట్, సపోర్టివ్. డైరెక్టర్‌‌‌‌‌‌‌‌గా తన విజన్‌‌‌‌ కచ్చితంగా ప్రేక్షకులకు కనెక్ట్‌‌‌‌ అవుతుంది. తమన్ గారి మ్యూజిక్‌‌‌‌కి నేను పెద్ద ఫ్యాన్‌‌‌‌ని. నేను నటించిన సినిమాకు ఆయన మ్యూజిక్ ఇవ్వడం హ్యాపీ.  పీపుల్ మీడియా సంస్థ చాలా పాషన్‌‌‌‌తో ఈ సినిమా తీశారు.  

నాకు స్కూల్ డేస్‌‌‌‌ నుంచే తెలుగు భాష అంటే ఇష్టం. బళ్లారికి చెందిన తెలుగు ఫ్రెండ్స్‌‌‌‌ ఉండడంతో ప్రతి పదానికి తెలుగు అర్థం తెలుసుకుని నేర్చుకునేదాన్ని. ‘కేజీఎఫ్‌‌‌‌’ సినిమా చేసేటప్పుడు నా పర్సనల్‌‌‌‌ టీమ్, మూవీ టీమ్‌‌‌‌లోనూ తెలుగు వాళ్లు ఎక్కువ ఉండడంతో తెలుగు మాట్లాడటం అలవాటైంది. ఈ సినిమాకు కుదరలేదు కానీ నెక్స్ట్ సినిమాకు కచ్చితంగా నేనే డబ్బింగ్ చెప్తాను. 

వెంకటేష్, త్రివిక్రమ్ కాంబో సినిమా గురించి స్పందిస్తూ... ‘నిజంగా నాకు తెలీదు. ఆ అవకాశం రావాలని నేనూ కోరుకుంటున్నా. అందులో హీరోయిన్ ఎవరనేది నిర్మాతలే చెబుతారు.