రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు
  • ఎండ.. కొంచెం ఠండా
  • నేడు, రేపు వర్ష సూచన

రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. బుధవారం కాస్త తగ్గగా, గురువారం కూడా మరింత తగ్గిపోయాయి. ఆదిలాబాద్‌, మెదక్‌‌‌‌ జిల్లాల్లో అత్యధికంగా 40.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు  రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణంగానే ఉన్నాయి. ఆదిలాబాద్‌ లో అత్యధికంగా 27 డిగ్రీలు, అత్యల్పంగా మెదక్‌‌‌‌లో 22 డిగ్రీల కనిష్ట  ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. గురువారం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. నాగర్‌‌‌‌కర్నూల్‌‌‌‌ జిల్లాలోని ఆమ్రాబాద్‌ లో 2.5 మిల్లీ మీటర్లు, సిద్ది పేట జిల్లాలోని హుస్నాబాద్‌ లో 2.3 మిల్లీ  మీటర్ల వర్షపాతం నమోదైంది. పశ్చిమ విదర్భ నుం చి కోస్తా కర్నాటక వరకు మరాఠ్వాడా, మధ్య మహారాష్ట్ర మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోం దని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో శుక్ర, శని వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.