పొద్దంతా ఎండ .. రాత్రంతా చలి

పొద్దంతా ఎండ ..  రాత్రంతా చలి

రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. పొద్దంతా ఎండ మంట ఉంటున్నా.. సాయంత్రం కాగానే చలి మొదలైతున్నది. సాయంత్రం 6 గంటల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. టెంపరేచర్లు బాగా పడిపోతున్నాయి. అన్ని జిల్లాల్లోనూ రాత్రి టెంపరేచర్లు 20 డిగ్రీలకన్నా తక్కువే నమోదవుతున్నాయి. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్​లో అత్యల్పంగా 11.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ శుక్రవారం తెలిపింది. యాదాద్రి జిల్లా నందిగాంలో 11.3, వికారాబాద్​లోని మోమిన్​పేట్​లో 11.5, సిద్దిపేట జిల్లా కొండపాక, సంగారెడ్డిలోని నల్లవల్లిలో 12.2, మహబూబ్​నగర్ జిల్లా రాజాపూర్​లో 12.5, మెదక్ జిల్లా శివ్వంపేటలో 13, ఆసిఫాబాద్​లోని గిన్నెదారిలో 13.1, ఆదిలాబాద్​లోని నేరడిగొండలో 13.7 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మిగతా అన్ని జిల్లాల్లోనూ 20 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.