ఉత్తర భారతాన్ని వణికిస్తున్న పొగమంచు, చలి గాలులు

ఉత్తర భారతాన్ని వణికిస్తున్న పొగమంచు, చలి గాలులు

ఢిల్లీని చలి వణికిస్తోంది.  దట్టమైన పొగమంచు, చలి గాలులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీలో ఉష్ణోగ్రతలు కనిష్టానికి పడిపోతున్నాయి. ఢిల్లీలో 6 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్‌లో 7.8 డిగ్రీలుగా రికార్డయిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో..వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.   మరో రెండు రోజులపాటు వాతావరణం ఇదే విధంగా టుందని చెప్పారు.

దేశ రాజధానిలో  చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది . కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవడంతో..ప్రజలు అవస్థలు పడుతున్నారు. చలి నుంచి ఉపశమనం పొందేందుకు ప్రజలు చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. ఢిల్లీలోని  మింటో రోడ్  లో ప్రజలు చలిమంటలు కాపుకుంటున్నారు. 

పొగమంచు కారణంగా ఢిల్లీకి రావాల్సిన 100కు పైగా విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.  మరో రెండు విమానాలను దారి మళ్లించినట్లు ఇందిరాగాంధీ విమానాశ్రయం ప్రకటించింది. స్పైస్‌ జెట్‌, ఇండిగో విమానాలను జైపూర్‌ మళ్లించామని పేర్కొంది.  

అటు పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్‌ను   దట్టమైన పొగమంచు  చుట్టుముట్టింది, చలి గాలులు నగరాన్ని వణికిస్తున్నాయి. అమృత్ సర్ లో కనిష్ట ఉష్ణోగ్రత 6 డిగ్రీలు,  గరిష్ట ఉష్ణోగ్రత 15 డిగ్రీలుగా నమోదయ్యాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఉదయం పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.