దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు

దేశవ్యాప్తంగా తెరుచుకున్న ఆలయాలు

సూర్యగ్రహణం తర్వాత దేశంలోని ఆలయాలన్నీ ఇవాళ తెరుచుకున్నాయి. సంప్రోక్షణ తర్వాత ఆలయాలను తెరిచారు. ఇవాళ కార్తీక మాసం కూడా ప్రారంభం కావడంతో భక్తులు పవిత్ర స్నానాలు చేశారు.  యూపీలోని ప్రయాగ్ రాజ్ లో గంగానదిలో భక్తులు స్నానాలు చేశారు. 

యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఉదయం 8 గంటలకు తెరుచుకుంది. స్వామి వారికి సుప్రభాత సేవ చేశారు. ప్రస్తుతం సంప్రోక్షణ జరుగుతోంది. ఉదయం 10.30 గంటలకు స్వామి వారి దర్శనానికి అనుమతి ఇచ్చారు అధికారులు. 

చిలుకూరి బాలాజీ ఆలయాన్ని అర్చకులు ఓపెన్ చేశారు . పవిత్ర జలాలతో ఆలయంలో సంప్రోక్షణ చేశారు. తర్వాత పూజలు చేసి భక్తులకు స్వామివారి దర్శనానికి అనుమతిచ్చారు.  కార్తీక మాసం ఇవాల్టి నుంచి ప్రారంభం అవడంతో భక్తులు భారీగా వస్తారని ఆలయ అర్చకులు తెలిపారు. నవంబర్ 8వ తేదీన చంద్రగ్రహణం సందర్భంగా మరోసారి ఆలయాన్ని మూసివేయనున్నట్లు తెలిపారు అర్చకులు. 

సూర్యగ్రహణం తర్వాత వరంగల్ లోని ఆలయాలు తెరుచుకున్నాయి. ఉదయం ఆరు గంటలకు వెయ్యి స్తంభాల గుడిని తెరిచి, సంప్రోక్షణ చేశారు. ఆ తర్వాత భక్తులను దర్శనానికి అనుమతించారు. ఇవాళ్టి నుంచి కార్తీక మాసం ప్రారంభం కావడంతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు  భక్తులు.