భద్రాచలం రాములోరి కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలు

భద్రాచలం రాములోరి కల్యాణానికి కోటి గోటి తలంబ్రాలు

భద్రాచలం,వెలుగు : భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈనెల 27న జరిగే శ్రీరామనవమి సీతారాముల కల్యాణానికి ఆంధ్రాలోని తూర్పుగోదావరి జిల్లా కోరు కొండకు చెందిన భక్తులు ఆదివారం కోటి గోటి తలంబ్రాలను సమర్పించారు. ఈవో దామోదర్​రావు, ఏఈవో శ్రావణ్​కుమార్​లు కోరుకొండ భక్త బృందం అప్పారావు ఆధ్వర్యంలో తెచ్చిన తలంబ్రాల   శోభాయాత్ర నిర్వహించారు. 

తలంబ్రాలకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.   హైదరాబాద్​కు చెందిన చలువాది మల్లి విష్ణు వందన బియ్యపు గింజలపై రాసిన రామకోటి తలంబ్రాలను  అందజేశారు. 2016 నుంచి రామకోటి తలంబ్రాలను సమర్పిస్తున్నారు. కాగా ఆదివారం భక్తులతో రామాలయం  కిటకిటలాడింది. గర్భగుడిలో సీతారామయ్యకు పంచామృతాలతో అభిషేకం చేసి బంగారు పుష్పాలతో అర్చన నిర్వహించారు.